Monday, January 30, 2023

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

- Advertisement -

హైదరాబాద్: నందమూరి తారక రామారావు(సీనియర్ ఎన్టీఆర్) 27వ వర్ధంతి పురస్కరించుకుని నగరంలోని నెక్లెస్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. బుధవారం తెల్లవారుజామున జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి, ఆయన సమాధి వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

వీరితోపాటు, బాలకృష్ణ, రామకృష్ణ, సుహాసినిలు కూడా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కు కుమారుడిగా పుట్టడం పూర్వజన్మ సుకృతమన్నారు. ఎన్టీఆర్ స్పూర్తితో టిడిపికి పూర్వవైభవం తీసుకువస్తామని తెలిపారు. ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని హరికృష్ణ కూతురు సుహాసిని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles