Wednesday, September 17, 2025

కరెంట్ కొనుగోళ్లపై న్యాయ విచారణ : రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ కరెంట్ ఒప్పందంపై జుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఒప్పందం నష్టమని చెప్పిన ఉద్యోగినిని గత ప్రభుత్వం ఎందుకు వేధించిందని అడిగారు. సదరు ఉద్యోగిని మారుమూల ప్రాంతానికి బదిలీ చేసి హోదా తగ్గించిందని దుయ్యబట్టారు. తెలంగాణ విద్యుత్ రంగం పరిస్థితిపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శాసన సభలో మాట్లాడారు.  మూడు అంశాలపై పూర్తి స్థాయిలో జుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. భద్రాది పవర్ ప్రాజెక్టులో వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపణలు చేశారు. కరెంట్ సెంటిమెంట్‌ను గత ప్రభుత్వం ఆర్థిక అవసరాలకు వాడుకుందని దుయ్యబట్టారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్‌లపై జ్యుడీషియల్ ఎంక్వైరీ చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు వివరిస్తున్నామని ఆయన చెప్పారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, విద్యుత్ అంశంపై న్యాయ విచారణ చేపడుతామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News