Tuesday, October 15, 2024

కోల్‌కతాలో ముదిరిన ప్రతిష్టంభన

- Advertisement -
- Advertisement -

కోల్‌కతాలో ఆర్‌జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనపై వైద్యుల నిరసనల వల్ల నెలకొన్న ప్రతిష్టంభన అంతం చేసేందుకు ఒక సమావేశానికి హాజరు కావాలని ఒక నెలకు పైగా సమ్మెలో ఉన్న జూనియర్ డాక్టర్లను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆహ్వానించింది. కానీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా చర్చల్లో పాల్గొనాలని, ప్రత్యక్ష ప్రసారం ఉండాలని డాక్టర్లు పట్టుబట్టుతున్నారు. దీనితో ప్రతిష్టంభన ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం తెల్లవారు జామున 3.49 గంటలకు ఇమెయిల్ ద్వారా పంపిన ప్రభుత్వ ఆహ్వానంలో సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర సచివాలయం నబన్నలో చర్చలను ప్రతిపాదించడమైంది.

సమావేశానికి 12 మంది నుంచి 15 మంది వరకు ప్రతినిధులను పంపాలని డాక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ విజ్ఞప్తి చేయడమే కాకుండా సకారాత్మక స్పందనను హర్షిస్తామని సూచించారు. అయితే. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరవుతారా అన్నది ఆహ్వానం ధ్రువీకరించలేదు. మంగళవారం సాయంత్రం 5 గంటలకల్లా తమ విధుల్లోకి తిరిగి చేరాలన్న సుప్రీం కోర్టు ఉత్తర్వును డాక్టర్లు ఖాతరు చేయకపోవడాన్ని కూడా పంత్ లేఖ ప్రస్తావించింది. అయితే, తమ ఆందోళనలో పలు వైద్య కళాశాలలు, ఆసుపత్రులు పాల్గొంటున్నందున కనీసం 30 మంది ప్రతినిధులు తమ బృందంలో ఉండాలని నిరసనకారులైన డాక్టర్లు బుదవారం సాయంత్రం సుమారు 5.23 గంటలకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News