Saturday, April 20, 2024

విశ్వనాథ్ మృతిపట్ల ప్రముఖుల సంతాపం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ కన్నుమూయడంతో ప్రముఖులు సంతాపం తెలిపారు. విశ్వనాథ్ మృతిపట్ల సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళిసై, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. నటుడు చిరంజీవి. మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. విశ్వనాథ్ మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.

కళాతపస్వి విశ్వనాథ్ మృతి తన దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. ఫిల్మ్ ఇండస్ట్రీ జీనియస్ కోల్పోయిందన్నారు. ఆయన దర్శకత్వం వహించిన శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం వంటి చిత్రాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని గవర్నర్ తెలిపారు.

సౌండ్ రికార్డిస్ట్‌గా సినీ ప్రస్థానం ప్రారంభించి తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేశారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. విశ్వనాథ్ దర్శకుడిగా తొలి అడుగుతోనే నంది అవార్డుతో ప్రారంభించారని మెచ్చుకున్నారు.

పితృసమానులు, గురువు కళా తపస్వి విశ్వనాథ్ గురంచి ఎంత చెప్పిన తక్కువ అవుతుంది, ఎంత చెప్పిన మాటలు చాలడం లేదని నటుడు చిరంజీవి అన్నారు. శంకరాభరణం విడుదలైన రోజునే ఆయన శివైక్యం చెందారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News