Tuesday, September 16, 2025

‘జైలర్’ నుంచి ‘నువ్వు కావాలయ్యా పాట’

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్‌ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జైలర్’. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి  ‘నువ్వు కావాలయ్యా’పాటని విడుదల చేశారు మేకర్స్. స్టార్ కంపోజర్ అనిరుధ్‌ ఈ పాటని క్యాచి బీట్స్ తో ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ నెంబర్ గా స్వరపరిచారు.  అరుణ్‌రాజా కామరాజ్‌ రాసిన ఈ పాటను శిల్పారావు, అనిరుధ్‌ కలసి ఎనర్జిటిక్ గా పాడారు.

Kaavaalaa Lyric Video from Jailerఈ పాటలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్వాగ్, గ్రేస్ మెస్మరైజ్ చేయగా, తమన్నా డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి.   ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్  రమ్య కృష్ణన్, తమన్నా తో పాటు వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు, జాఫర్ సాదిక్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. టాప్ టెక్నికల్ టీం ఈ చిత్రానికి పని చేస్తోంది. విజయ్ కార్తిక్ కన్నన్ కెమరామెన్ గా పనిచేస్తుండగా ఆర్ నిర్మల్ ఎడిటర్ గా చేస్తున్నారు. డిఆర్ కే కిరణ్ ఆర్ట్ డైరెక్టర్ కాగ, స్టన్ శివ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. జైలర్ ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News