Sunday, May 5, 2024

‘నా.. నీ ప్రేమ కథ’ టీజర్ లాంచ్ చేసిన మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

అముద శ్రీనివాస్ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నా.. నీ ప్రేమ కథ’. కారుణ్య చౌదరి కథానాయిక. పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ ని తెలంగాణ ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ‘నా.. నీ ప్రేమ కథ’ చిత్రం టీజర్ అద్భుతంగా వుంది. హీరో, దర్శకుడు అముద శ్రీనివాస్ చక్కన్ని ప్రతిభ కనబరిచారు. ఈ టీజర్ ని చూస్తుంటే సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. సినిమాలో నటీనటులంతా మంచి ప్రతిభ కనబరిచారు. ఈ చిత్రంతో నిర్మాత పోత్నాక్ శ్రవణ్ కుమార్ కి మంచి లాభాలు రావాలి. హీరో, దర్శకుడు అముద శ్రీనివాస్ కి మంచి అవకాశాలు అందుకోవాలి. చిత్ర యూనిట్ అందరికీ శుభాభినందనాలు’’ తెలిపారు. ఈ చిత్రానికి ఎంఎస్ కిరణ్ కుమార్ కెమరామెన్ గా పని చేస్తున్నారు. ఎంఎల్ పి రాజా సంగీతం సమకూరుస్తుండగా చిన్నా నేపధ్య సంగీతం అందిసస్తున్నారు. నందమూరి హరి ఎడిటర్ గా పని చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News