న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో తనకు తీవ్ర గాయాలయ్యాయంటూ వస్తున్న వార్తలపై టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ స్పందించారు. తాను క్షేమంగానే ఉన్నానని పేర్కొంది. సోమవారం రాత్రి కాజల్ కు రోడ్డు ప్రమాదం జరిగినట్లు, ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయని సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొట్టాయి. దీంతో ఆమె అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో స్వయంగా కాజల్ స్పందిస్తూ.. తనపై వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు.
తన ఎక్స్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ పెడుతూ.. పుకార్లను పట్టించుకోవద్దని తన అభిమానులను కోరింది. ‘నేను ఒక ప్రమాదంలో గాయపడ్డానంటూ కొన్ని నిరాధారమైన వార్తలను చూశాను. నిజాయితీగా చెప్పాలంటే, ఇది చాలా ఫన్నీగా ఉంది.. ఎందుకంటే ఇది పూర్తిగా అవాస్తవం. దేవుని దయవల్ల, నేను పూర్తిగా క్షేమంగా, సురక్షితంగా, చాలా బాగానే ఉన్నానని మీ అందరికీ హామీ ఇవ్వాలనుకుంటున్నాను. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని లేదా ప్రచారం చేయవద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రేమ, కృతజ్ఞతతో మీ కాజల్’ అని పేర్కొంది.
Also Read: ‘లిటిల్ హార్ట్స్’ సినిమాపై నాని ప్రశంసలు