Thursday, April 25, 2024

సిద్దిపేట తలాపున జలాశయాలు!

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు 2016 మే 2న శంకుస్థాపన చేసి మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం జరిగింది. 2019 జూన్ 21న సిఎం కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. కాళేశ్వరం గంగ పరువళ్లతో తెలంగాణ మాగాణి సస్యశ్యామలం అవుతుంది. తెలంగాణ నడ్డగడ్డ సిద్దిపేట తలాపున మహా సముద్రాలు తలపిస్తున్నాయి.. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో సిద్దిపేట జిల్లా రిజర్వాయర్ల ఖిల్లాగా మారింది. రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా లో అత్యధికంగా రిజర్వాయర్లు నిర్మించారు. అన్నపూర్ణ , శ్రీరంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, తోటపల్లి ఆన్లైన్, గౌరవెల్లి – గండిపల్లి, తపాస్పల్లి రిజర్వాయర్లు సిద్దిపేట జిల్లాకు నలుదిక్కులా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలోని దేవాలయాల పేర్ల మీదనే రిజర్వాయర్లు నిర్మించారు. సిఎం కెసిఆర్ చేసిన గొప్ప ప్రయత్నంలో బీడువారిన పంట పొలాలు సస్యశ్యామలమయ్యా యి.

ఎటు చూసినా పచ్చని పంట పొలాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలసాకారం అయిన రోజు నుండే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రపంచమే అబ్బుర పడే విధానంగా తన మేధోసంపత్తి నుండి పుట్టిన సంకల్పం బృహత్తర నిర్మాణం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గోదారమ్మ ఒడిలో కాళేశ్వరం నుండి గలగలా గంగమ్మ తెలంగాణ మాగాణిని తడిపింది.. ఏళ్ళ తరబడి బీడువారి నోళ్లు తెరిచిన భూములు సస్యశ్యామలం అయ్యాయి. తెలంగాణ పుడమి తల్లిగర్భం నీటి గలగలలతో పులకరించింది. గోదారమ్మ తెలంగాణ నేల నలు చెరగులా ఉరకలేస్తూ ఉప్పొంగుతూ మల్లన్న సాగర్‌లో జల దీపం వెలిగించింది. కెసిఅర్ సంకల్పం.. అద్భుత వ్యూహ ప్రణాళిక, దిశా నిర్దేశంతో అప్పటి ఇరిగేషన్ మంత్రి, నేటి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శ్రమ జీవిలా కార్యాచరణ కలిసి రావడంతో కాళేశ్వరం శరవేగంగా నిర్మాణమై తెలంగాణ తల్లి ఒడిలో ఒదిగిపోయింది.

కోటి ఎకరాలకు నీళ్లు అందించాలన్న లక్ష్యంలో అన్నపూర్ణ రిజర్వాయర్ అత్యంత కీలకం. శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్ నుండి అన్నపూర్ణకు చేరుకుంటాయి.అక్కడి నుంచి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపొచమ్మ సాగర్ జలాశయాలకు చేరుకుంటాయి. అన్నపూర్ణతో సిద్దిపేట, రాజన్న సిరిసిల్లా జిల్లాలో 35 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి 3.535 కిలోమీటర్ల పొడవు గ్రావిటీకాలువ ద్వారా వచ్చే నీరు తదుపరి సొరంగం మార్గం ద్వారా 7.651 కి.మీ దూరం వచ్చి సర్జిపుల్ మహాబావిలోకి చేరుతాయి. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు అన్నపూర్ణలోకి ఎత్తిపోసేందుకు నాలుగు పంపులను ఏర్పాటు చేశారు. ఒక్కో మోటార్ సామర్థ్యం 106 మెగావాట్లు. నాలుగు కలిపి ఒక టిఎంసి నీటిని అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తాయి.

రంగనాయకసాగర్ జలాశయం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లో భాగంగా సిద్దిపేట జిల్లా, చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ గ్రామాల సమీపంలో నిర్మించిన జలాశయం. 2,300 ఎకరాల్లో రూ. 3,300 కోట్ల ఖర్చుతో 3 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయం సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని 1,14,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తుంది. 2020 ఏప్రిల్ 24న మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, హరీశ్ రావులు రంగనాయక సాగర్‌ను ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది 7వ లిఫ్టు. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి ఆరో దశ ఎత్తిపోతతో అన్నపూర్ణ జలాశయానికి చేరుకున్న గోదావరి జలాలు, రంగనాయకసాగర్ పంప్‌హౌజ్ ప్రారంభంతో రంగనాయకసాగర్ జలాశయంలోకి చేరాయి.

అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి అప్రోచ్ ఛానల్ (1.746 కి.మీ) లో ప్రవహించిన గోదావరి జలాలు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఎల్లాయిపల్లి హెడ్ రెగ్యులేటరీకి చేరుకొని అక్కడి నుండి గ్రావిటీ కెనాల్ (0.354 కి.మీ), సొరంగం (8.59 కి.మీ) ద్వారా రంగనాయక్ సాగర్ సర్జ్‌పూల్ (చంద్లాపూర్ పంప్‌హౌజ్) కు వస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నపూర్ణ రిజర్వాయర్ మల్లన్నసాగర్ కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలో మూడు ప్రాంతాల్లో ఆర్‌అండ్‌ఆర్ కాలనీలను నిర్మించింది. ముంపునకు గురైన గ్రామాలకు దీటుగా అధునాతన హంగులతో నిర్వాసితులు కోరుకున్న రీతిలో వీటిని నిర్మించడం విశేషం.

కొండపోచమ్మ జలాశయం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లింక్ 4, ప్యాకేజీ 14లో భాగంగా సిద్దిపేట జిల్లా, మర్కూక్ పాములపర్తి గ్రామాల సమీపంలో నిర్మించిన జలాశయం. సముద్ర మట్టానికి 510 మీటర్ల ఎత్తులో రూ. 1,540కోట్ల వ్యయంతో 15 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయం ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా, మేడ్చల్ జిల్లాలకు సాగునీరు అందిస్తుంది. 2020, మే 29న సిఎం కెసిఆర్ చేతులమీదుగా ఈ జలాశయం ప్రారంభమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది 10వ లిఫ్టు. ప్రదేశం మర్కూక్ – పాములపర్తి. ఆనకట్ట రకం బ్యారేజి నిర్మించిన జల వనరు గోదావరి నది జలాశయం సృష్టించేది.

కొండపోచమ్మ జలాశయం మొత్తం సామర్థ్యం 15 టిఎంసివిద్యుత్ కేంద్రం నిర్వాహకులు తెలంగాణ రాష్ట్రం జలాశయం. దీని నిర్మాణానికి దాదాపు 5,696 ఎకరాల భూమిని సేకరించారు. నీటిని తరలించడానికి కాలువలు తవ్వి అవసరమైన గొట్టాలు, ఎత్తిపోతలకు మోటార్లు ఏర్పాటు చేశారు. గజ్వేల్ మండలం, అక్కారం వద్ద 27 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటార్లతో ఆరు గొట్టాల నుంచి నీరు మర్కూక్ పంప్ హౌజ్‌కు చేరుకునేలా ఏర్పాటు చేశారు. 15.8 కి.మీ వలయాకారంలో నిర్మించిన కొండపోచమ్మ జలాశయం వద్ద 34 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటార్లను ఏర్పాటు చేశారు.

కొండపోచమ్మ జలాశయం సామర్థ్యం: 15 టిఎంసిలు, వలయాకారం కట్ట: 15.8 కిలోమీటర్లు. ప్రాజెక్టు ఖర్చు: రూ. 1,540 కోట్లు. మొత్తం ఆయకట్టు: 2,85,280 ఎకరాలు, జలాశయం ఎఫ్‌ఆర్‌ఎల్: 618 మీటర్లు, కట్ట ఎత్తు: 46 మీటర్లు, కట్ట వెడల్పు: 6 మీటర్లు, రెగ్యులేటర్లు: 4. ముంపు ప్రాంతం: 4,636 ఎకరాలు. ప్రధాన స్లూయిస్‌లు: సంగారెడ్డి ప్రధాన కెనాల్, కేశవపూర్ కెనాల్, జగదేవ్‌పూర్ కెనాల్ లబ్ధి పొందనున్న జిల్లాలు: సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, యదాద్రి భువనగిరి. ప్రధాన కాల్వలు:

రామాయంపేట, గజ్వేల్, ఉప్పరపల్లి, కిష్టాపూర్, తుర్కపల్లి, జగదేవ్‌పూర్, తుర్కపల్లి(ఎం), శంకరంపేట, సంగారెడ్డి. 618 మీటర్ల ఎత్తుకు గోదావరి నీరు చేరవేసే ఈ రిజర్వాయర్ దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనుంది. కాలువ ద్వారా కేశవాపూర్ జలాశయానికి నీటిని తరలించి, అక్కడ 10 టిఎంసిల నీటిని శుద్ధిచేసి గోదావరి రింగ్ మెయిన్ పైపులైన్‌లతో హైదరాబాదు నగరానికి తాగు నీటిని సరఫరా చేస్తారు. కొండపోచమ్మ రిజర్వాయర్ కింద ముంపునకు గురైన ములుగు మండలంలోని మామిడ్యాల. బైలాంపూర్. తానే దామర్‌పల్లి నిర్వాసితుల కోసం తునికి బొల్లారం వద్ద 260 ఎకరాలలో 1139 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇచ్చారు.
ప్రకృతి ప్రపంచానికి పచ్చ బొట్టు. తెలంగాణ మడికి గుండె మల్లన్నసాగరమే. మల్లన్న సాక్షిగా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి. సిద్దిపేట నెత్తిననే కాళేశ్వరం గంగమ్మ కొలువు దీరింది. కాళేశ్వరుని పాదాలను తడిపి గలగల పరుగులీడుతూ రాజేశ్వర స్వామి జల సన్నిధిని అన్నపూర్ణ ఒడిని నింపుకుని రంగనాయసాగర్ నుండి పెలపెలమంటూ సొరంగం చీల్చుకుంటూ మల్లన్నకు జల బోనం నిండుకుండా ఉప్పొంగి కరువు నెల మట్టి తడిపింది.
సిరులొలికించే జలప్రదాయిని మల్లన్నసాగరము.. చుట్టూ గుట్ట లు, వాగుల, వంకలు, ఒర్రెలు అడవులతో అలుముకున్న జల మందారం. నది లేని చోట మైదానంలో మహా సముద్ర గంగ. గోళాకారంలో పెద్ద జల బంగాళాఖాతంలా అద్భుతమైన సాగర సింగారం.. విప్లవోద్యమాల అడ్డా మల్లన్నసాగరహారం అయింది. ఉద్యమ మట్టిని ముద్దాడిన అన్నల ఎర్ర జెండాలు ఎగిరిన మట్టిలోనే మల్లన్న సాక్షిగా కాళేశ్వరం గంగమ్మ జల సవ్వడి వినపడుతుంది. పక్కనే కుడెల్లి వాగు జలకళతో నర్మాల చెరువుకు చేరింది. తాతల ముత్తాతలు కాలం నుండి ఆ మట్టిలో పుట్టి పెరిగిన బిడ్డలు తెలంగాణ మాగాణికి నీళ్ల తొవ్వచూపిన త్యాగధనుల ఉద్యమ గడ్డ సిద్దిపేట, దుబ్బాక బిడ్డలు. కరువు నేల సిద్దిపేట నెత్తిన గంగమ్మను తెచ్చిన భగీరథుడు.. మల్లన్న సాక్షిగా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి తెలంగాణ.
ఈ రిజర్వాయర్ నుంచే కొండపోచమ్మసాగర్, గంధమల, బస్వాపూర్‌లతో పాటు, సింగూరు, నిజాంసాగర్, ఎస్సారెస్పీ స్టేజ్ -1 ఆయకట్టుకు నీళ్లు చేరనున్నాయి. మొత్తంగా ఈ రిజర్వాయర్‌పై ఆధారపడిన కొత్త ఆయకట్టు 8.33 లక్షల ఎకరాలు ఉండగా, స్థిరీకరణ ఆయకట్టు మరో 7.37 లక్షల ఎకరాలు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 4లో భాగంగా రూ. 6.805 బడ్జెట్‌తో 50 టిఎంసిల సామర్ధ్యంతో మల్లన్నసాగర్ నిర్మాణమైంది. మల్లన్నసాగర్ నిర్మాణంతో కాళేశ్వరం లింక్ 4 సంపూర్ణం. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 17,871 ఎకరాల భూమిని సేకరించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో రాంపూర్, బ్రాహ్మణబంజేరుపల్లి, లక్ష్యాపూర్, ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, పల్లెపహాడ్, సింగారం, ఎర్రవెల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతుండగా, పాక్షికంగా ముంపునకు గురైనవి తొగుట మండలంలోని తుక్కాపూర్,

కొండపాక మండలంలోని తిప్పారం, మంగోల్‌గ్రామాల. 4,298 కుటుంబాలు ముంపునకు గురయ్యాయి. భూనిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం అందించి ఆదుకుంది. దేశం లో ఎక్కడా లేని విధంగా సిఎం కెసిఆర్ భూనిర్వాసితులకు పునరావాసం, పునరోపాధి కింద 2019 మే మాసంలోనే ముంపు గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహించి సాయాన్ని అందించారు. ముంపు గ్రామాల రైతులు కోల్పోయిన భూములు, వ్యవసాయ కొట్టాలు, బావులు, బోరుబావులు భూములతో పాటు, ఇండ్లు, పశువుల కొట్టాలు, బోరుబావులన్నింటికీ విలువగట్టి అధికారులు పరిహారం అందించారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల భూనిర్వాసితులకు గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ఎడ్యుకేషన్ హబ్ పక్కన అందరికీ కలిపి 800 ఎకరాల విస్తీర్థంలో కట్టించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News