Saturday, May 4, 2024

కల్యాణ లక్ష్మికమనీయం

- Advertisement -
- Advertisement -

కల్యాణ లక్ష్మి కమనీయం.. తెలంగాణ ఆడ బిడ్డలకు కల్యాణ వైభోగం.. పుట్టినింట నుండి మెట్టినింట ఆడ బిడ్డ తొలి అడుగుకు భరోసా.. పేద తల్లి దండ్రుల పడే బాధలను దూరం చేసిన ఉద్యమ నేత కెసిఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ప్రారంభించి ఆడ పిల్లల పెండ్లికి భరోసా నింపి పేద తల్లిదండ్రుల కండ్లలో సంతోషం వెలుగు నింపారు. ఈ తొమ్మిదిన్నర యేండ్లలో సుమారు 13 లక్షల మంది ఆడ బిడ్డల పెండ్లికి వరమైంది. పేదింటి బిడ్డలకు భరోసా నింపింది. ఒకప్పుడు పేదింట ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే అప్పు చేయాల్సిందే. అలా చేసి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు ఎన్నో. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డల వివాహం భారం కాకుండా తెలంగాణ సర్కారు 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ప్రవేశపెట్టిన అద్భుత పథకం విజయ వంతంగా కొనసాగుతున్నది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. ఈ పథకం ద్వారా రూ. 1,00,016 అందిస్తున్నారు. ఈ పథకం దివ్యాంగ ఆడ పిల్లలకూ ఎంతో ఆసరాగా నిలిచింది. వీరికి 25 శాతం అదనంగా సహాయం కలుపుకుంటే 1 లక్ష 25 వేల 16 రూపాయలు అందిస్తుంది.

ఇప్పటి వరకు 512 మంది దివ్యాంగ ఆడ బిడ్డలకు రూ. 6.40 కోట్ల సహాయం అందింది. ఇంకో ముఖ్యమైన అంశం 90 శాతం 5.62 మంది బిసి లబ్ధిదారులు లబ్ధి పొందారు. పథకం వల్ల ఒకవైపు పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గిపోవడంతోపాటు బాల్య వివాహాలు తగ్గాయి. తద్వారా వాటిల్లే మాతాశిశుమరణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు అమ్మాయిలు విద్యాభ్యాసం పెరిగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్ళలో ఏ ప్రధాని, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రీ ప్రవేశపెట్టని పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ ఆడబిడ్డలకు ‘కల్యాణ లక్ష్మి’ ఒక గొప్ప కానుక అందించిండు.. ఎవరు అడగలేదు.. కెసిఆర్ సార్ గొప్ప ఆలోచనతో ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం తరపున ఆసరాగా నిలవాలని కల్యాణ లక్ష్మి పథకం ద్వారా వారికి భరోసా కల్పించారు. పెళ్లి అంటే నూరేళ్ల పంట అన్నట్టు.. ఆడపిల్ల తల్లిదండ్రులు పుట్టింటి నుండి మెట్టినింట సుఖ సంతోషాలతో వాళ్ళ సంసారం జీవనం సాగాలని కోరుకుంటారు.

మెట్టినింట బిడ్డ సంతోషంగా ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉంటారు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలంటే ఎన్నో రకాల ఆలోచనలు చేసి మంచి సంబంధాలు చూసి ఏ లోటు రాకుండా చూసుకునే భర్త, అత్తమామ ఇంటికి పంపుతారు. తెలంగాణ ప్రభుత్వం తరుపున సిఎం కెసిఆర్ అందించే కల్యాణ లక్ష్మి ఆడపిల్లల పెళ్లికి ఎంతో సహకారం అందిస్తుందని తల్లిదండ్రులకు ధైర్యం కలుగుతుంది. పెళ్లి ఖర్చులకు కల్యాణ లక్ష్మిబాసటగా నిలుస్తుందని పిల్లల తల్లిదండ్రులకు సిఎం కెసిఆర్ ఉన్నారని ధీమా కలుగుతుంది.తెలంగాణ ఆడబిడ్డకు సిఎం కెసిఆర్ అందించిన వరం కల్యాణ లక్ష్మి పథకం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకం అమలులో లేదు. ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డలకు మన సిఎం కెసిఆర్ అందించిన గొప్ప కానుక. తెలంగాణలో ప్రతి పేద కుటుంబంలో పెళ్ళీడుకు వచ్చిన ప్రతి బిడ్డకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎంతో చేయూతనిస్తుంది. బిడ్డ పెళ్లి చేయాలంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతున్నది చూస్తున్నాము.

ఒక లక్షా పదహారు రూపాయలు అందించడం అంటే గొప్ప మనసు ఉండాలి. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఏ తల్లిదండ్రులూ తమ బిడ్డల పెళ్లి కోసం ఇబ్బందులు పడద్దు. కనీస ధర్మంతో మానవీయ కోణంలో తెలంగాణ బిడ్డకు మనమే అండగా ఉండాలి.ఆ కుటుంబానికి పెద్ద కొడుకుగా, తండ్రి లాగా బాధ్యత మోసినట్టు బిడ్డ పెళ్లికి ప్రభుత్వం తరపున నిండైన మనసుతో పెళ్లి ఖర్చులకు ఆసరా అయ్యేలా చేయూత అందించాలని మన సిఎం కెసిఆర్ చరిత్రాత్మక పథకాన్ని తెచ్చిన తెలంగాణ ఆడబిడ్డల కళ్ళలో ఆనందం పంచిండు. నిజంగా కల్యాణ లక్ష్మిచాలా గొప్ప మానవీయ చేయూత నిచ్చే పథకం. ఇలాంటి పథకాలు పుట్టాలంటే గొప్ప మనసు, మమత కలిగి ఉండాలి. ఇప్పుడు తెలంగాణలో కెసిఆర్ మనకూ, మన కుటుంబానికీ ఇంటికి పెద్ద కొడుకులా వేన్నారు. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేయాలంటే లక్షల రూపాయల ఖర్చు, కానుకలు ఇవ్వాల్సిందే. మన బిడ్డలను మనము కాపాడుకునేలా పేదింటి మహిళలకు ప్రభుత్వమే తల్లిదండ్రులుగా అండగా ఉండాలనే సంకల్పంతో, గొప్ప మానవీయతతో మన పెద్దాయన సిఎం కెసిఆర్ తెచ్చిన కల్యాణ లక్ష్మిపథకం ద్వారా పెళ్ళీడుబిడ్డకు ధైర్యంగా జీవించే కానుక, కన్నీళ్లు తుడిచే పథకం.

కల్యాణ లక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద దళిత, గిరిజన, బిసి, ఒబిసి కులాలకు చెందిన యువతులకు ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. 2017 సంవత్సరం బడ్జెట్‌లో ఈ పథక ఆర్థిక సాయాన్ని రూ. 51 వేల నుండి రూ. 75,116 లకు పెంచారు. 2018 మార్చి 19న రూ. 1,00,116 కు పెంచారు. కల్యాణలక్ష్మిపథకం ఆడబిడ్డల వివాహానికి రూ 1,00,116 సాయం. 2014 బడ్జెట్‌లో, ప్రతి సంవత్సరం రూ. 1450 కోట్లు కేటాయించారు. 18 ఏళ్లు వయో పరిమితి ఉన్న యువతులకు ఈ పథకం వర్తిస్తుంది. ఆర్థిక సహాయం 19 మార్చి 2018న రూ. 75,116 నుండి రూ. 1,00,116కి పెంచారు. ఇది పెళ్లి సమయంలో వధువు కుటుంబానికి పెళ్లి ఖర్చుల కోసం అందించబడుతుంది. 2018-19 సంవత్సరానికి బడ్జెట్‌లో రూ. 1450 కోట్లు కేటాయించారు. కల్యాణ లక్ష్మి పథకం కింద 2020 -21 సంవత్సరానికి బడ్జెట్‌లో రూ. 1850 కోట్లు కేటాయించారు.

కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 2021, సెప్టెంబర్ 18వ తేదీ నాటికి 7,14,575 మంది ఆడ పిల్లలకు లబ్ధి చేకూరింది. దీని కోసం ప్రభుత్వం రూ. 5,556.54 కోట్లు వెచ్చించింది. అదే 2022 సంవత్సరం నాటికి 11 లక్షల 62 వేల మంది ఆడబిడ్డల పెళ్ళిళ్ళకు రూ. 10 వేల కోట్లు అందజేశారు. 2023 మార్చి నాటికి 12 లక్షల 69 వేల మందికి లబ్ధి చేకూరింది. 2023 24 బడ్జెట్‌లో కల్యాణ లక్ష్మి పథకానికి రూ. 3210 కోట్లు కేటాయించారు. ఈ ఆగస్టు మాసాం తం వరకు చూస్తే దాదాపు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా లబ్ధిదారులు 13 లక్షలకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News