Saturday, August 16, 2025

ఆశ్రమంలో వంట మనిషిపై బాబా అత్యాచారం?

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఆశ్రమంలో వంట మనిషిపై బాబా అత్యాచారం చేసిన సంఘటన ఒడిశా రాష్ట్రం ఢెంకనాల్ జిల్లా కామఖ్యానగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆశ్రమంలో ఓ మహిళ వంటలు చేసి భోజనాలు వండిచేది. ఒక రాత్రి బాబాకు భోజనం పెట్టిన అనంతరం తన రూమ్‌లోకి వెళ్లి ఫోన్‌లో వీడియోలు చూసి నిద్రకు ఉపక్రమించింది. బాబా రూమ్‌లో వెళ్లి ఆమెపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె నిరాకరించడంతో బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు బాబాను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News