Sunday, November 3, 2024

కన్నడ నటుడు దర్శన్‌కు మధ్యంతర బెయిల్‌

- Advertisement -
- Advertisement -

కన్నడ హీరో దర్శన్‌కు కర్ణాటక హైకోర్టలో భారీ ఊరట లభించింది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ హత్య కేసులో జూన్‌ 11 దర్శన్‌ అరెస్టైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన రిమాండ్ ఖైదీగా బళ్లారి సెంట్రల్ జైలులోనే ఉన్నారు. వైద్య చికిత్స కోసం బెయిల్ ఇవ్వాల్సిందిగా దర్శన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం కోర్టు విచారణ చేపట్టారు.

ఈ సందర్భంగా నటుడు దర్శన్ తరుపు న్యాయవాది సివి నగేష్, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి ప్రసన్న కుమార్‌లు కోర్టులో వాదనలు వినిపించారు. అనంతరం జస్టిస్ ఎస్ విశ్వజిత్ శెట్టి మధ్యంతర బెయిల్ దరఖాస్తుపై తీర్పు బుధవారానికి రిజర్వ్ చేశారు. ఈ క్రమంలో హైకోర్టు ఇవాళ దర్శన్ కు షరతులతో కూడిన ఆరు వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల పాటు వైద్య చికిత్స కోసం విడుదల కానున్నారు. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News