Saturday, June 28, 2025

కాంటా లంగా గర్ల్ ఇకలేరు

- Advertisement -
- Advertisement -

ముంబయి: కాంటా లంగా గర్ల్, నటి షఫాలీ జరివాలా(42) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి షఫాలీ అస్వస్థతకు గురికావడంతో భర్త పరాగ్ ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆమె గుండెపోటుతో చనిపోయిందని తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయాన్ని బయటక ప్రకటించలేదు. 2005లో కాంటా లాగా సాంగ్‌లో నటించి దుమ్ములేపారు. ఆ పాటతోనే ఆమె మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.

అప్పటి నుంచి ఆమెను అభిమానులు కాంటా లాగా గర్ల్‌గా  ముద్దుగా పిలుచుకుంటున్నారు. బిగ్‌బాస్ 13లోకి కంటెస్టెంట్ గా వచ్చి అలరించారు. పలు టివి రియాలిలీ షోలలో కూడా పని చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఇన్‌స్టాలో ఆమె 33 లక్షల మంది ఉన్నారు. దీంతో బాలీవుడు నటులు, నటిమణిలు ఆమె మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆమె మృతి తనకు షాక్‌కు గురి చేసిందని సింగర్ మికా సింగ్ కన్నీంటి పర్యంతమయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News