Friday, May 24, 2024

మహిళపై హత్యాచారం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: 55 ఏళ్ల మహిళపై యువకుడు అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాయ్‌చూర్‌కు చెందిన ఓ మహిళ గత కొన్ని సంవత్సరాల నుంచి బెంగళూరులో ఉంటుంది. యుపిలోని గోరఖ్‌పూర్‌కు చెందిన 23 ఏళ్ల యువకుడు బెంగళూరులో ఉంటున్నాడు. మహిళ మద్య కోసం తన ఇంటికి సమీపంలో ఉన్న వైన్‌షాపుకు వెళ్లింది. ఓ యువకుడు ఆమెను అనుసరిస్తూ నిర్మాణంలో ఉన్న భవనంలోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు. భవనం యజమానికి మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సిసి కెమెరాల ఆధారంగా మృతురాలు, నిందితుడిని గుర్తించారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News