Tuesday, October 15, 2024

దేవాలయాల ప్రసాదంకు ‘నందిని నెయ్యి’ని తప్పనిసరి చేసిన కర్నాటక

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) లడ్డూ నాణ్యత రభస నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. కర్నాటక దేవాదాయ శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలోనూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ నందిని నెయ్యినే విధిగా వాడాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక పై భారతీయ ఆహార భద్రత విలువ సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఐ) ప్రమాణాలకు అనుగుణంగానే ప్రసాదాలకు ధ్రువీకరణ ఇవ్వనున్నారు. లడ్డు, కేసరిబాత్, హల్వా, చక్కెర పొంగలి, పంచామృతం వంటి వాటికి వాడే పాలు,పెరుగు, నెయ్యి నందిని సంస్థ నుంచే కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కర్నాటక పాల మండలి(కెఎంఎఫ్) తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏడాదికి 350 మెట్రిక్ టన్నుల నెయ్యిని అందిస్తున్నట్లు కెఎంఎఫ్ ఎండీ జగదీశ్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News