Sunday, May 4, 2025

కర్నాటక ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ ఏడాది తెలంగాణలో జరుగనున్న ఎన్నికల్లో కర్నాటక ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపబోవని భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కె.టి.రామారావు వ్యాఖ్యానించారు. అయితే కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంపై శుభాకాంక్షలు తెలిపారు. బిజెపి తప్పుడు, విచ్ఛిన్నకర రాజకీయాలను తిప్పికొట్టినందుకు ఆ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ది కేరళ స్టోరీ’ సినిమా కర్నాటక ప్రజలను రంజింపచేయడంలో ఎలా విఫలమైందో, అదే విధంగా కర్నాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపవన్నారు.

‘ గొప్ప భారత దేశం కోసం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు సృష్టించడం కోసం హైదరాబాద్, బెంగళూరు ఆరోగ్యకరంగా పోటీపడనివ్వండి. కర్నాటకలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు’ అని ఆయన ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News