ఛత్తీస్‌గఢ్-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ఉన్న కర్రెగుట్టల్లో 9వ రోజు పోలీసులు, భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టుల కోసం భద్రతా బలగాల కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నారు. కర్రెగుట్ట అటవీప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అయితే, ఎండల తీవ్రత బలగాల ఆపరేషన్ కు ఆటంకంగా మారింది.
కాగా, ఈ కర్రెగుట్టల్లో దాదాపు వెయ్యి మందికి పైగా మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో కేంద్ర సర్కార్ పెద్ద ఎత్తున బలగాలను దింపింది. స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు బాంబులతో మావోలపై విరుచుకుడ్డారు.దీంతో ఇప్పటికే అనేక మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. ఈక్రమంలో మావోలు చర్చలకు తాము సిద్దమని లేఖ విడుదల చేసింది. మరోవైపు, ప్రజా సంఘాలు సైతం కాల్పులు విరమించాలని ప్రభుత్వాన్ని కోరాయి. అయినా, కేంద్ర సర్కార్.. ఆపరేషన్ ను కొనసాగిస్తోంది.