Friday, April 26, 2024

రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: అల్పపీడన ప్రభావం తో రాష్ట్రంలో గురువారం ఆదిలాబాద్, కొమురంభీం, మంచి ర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం, ములుగు, వరంగల్ అర్భన్, రూరల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ పరిధలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, పంజాగుట్ట, నిజాంపేట్, సోమాజిగూడ, నాంపల్లిలో వాన పడింది. చింతల్, సుచిత్ర, కుత్బుల్లాపూర్, కొంపల్లి, బాలానగర్ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రోడ్లపైకి భారీగా వర్షపునీరు చేరింది. పాతబస్తీలోనూ చిరుజల్లులుగా మొదలై భారీవానగా మారింది. సుమారు అరగంట పాటు కురిసిన వర్షంతో చంద్రాయణగుట్ట, బార్కస్, ఫలక్‌నుమా, ఛత్రినాక ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. ముషీరాబాద్, రాంనగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, చిక్కడపల్లి, విద్యానగర్, అడిక్‌మెట్, గాంధీనగర్, కవాడిగూడ, భోలక్‌పూర్‌లో వర్షం కురిసింది. ఈ ప్రాంతాలతో పాటు బోరబండ, అల్లాపూర్, మోతీనగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, అమీర్‌పేట, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, జేబీఎస్, బేగంపేటలో కూడా వాన పడింది. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో.. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నగరంలోని కొన్ని చోట్ల వర్షపు నీటి వల్ల ట్రాఫిక్ నిలిచిపోగా… వాహనాలను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు.

మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లిలలో కురిసిన వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆదిలాబాద్ జిల్లా పెన్‌గంగ ఒడ్డున ఉన్న భీంపూర్ మండలం అంతర్గాంలో గురువారం కురిసిన భారీ వర్షానికి అంతర్గాం గ్రామంలోని చిన్నవాగు (పాయ) వరదతో పోటెత్తింది. దీంతో కల్వర్టుపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బస్సులు, వాహనాల ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. అంతర్గాం సహా పలు గ్రామాల శివారులోని పంట పొలాలు జల మయమయ్యాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలయమయమ్యాయి. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేం ద్రంతోపాటు సుంకేట్ గ్రామాల్లో గురువారం సాయం త్రం భారీవర్షం కురిసింది. సుంకేట్ గ్రామంలో 2 గంటలు భారీ వర్షం కురవడంతో పంటపోలాల్లో నీళ్లు చేరి వరదల్లో ఇదివరకే విత్తిన సోయా, మొక్కజొన్న, పసుపు పంటలు వరద నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Heavy Rains in Several Areas in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News