Thursday, September 18, 2025

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది సజీవదహనం

- Advertisement -
- Advertisement -

లక్నో: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో ఎనిమిది మంది మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కౌశాంబిలో జరిగింది. కోఖ్‌రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భర్వారీ పట్టణంలో ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు జరగడంతో 8 మంది సజీవదహనం కాగా మరో పది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఫ్యాక్టరీలో ఇంకా ఎనిమిది మంది చిక్కుకున్నట్టు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. మృతుల కుటుంబాలకు సిఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News