Thursday, November 30, 2023

తెలంగాణలో బిజెపి రాజ్యాంగం నడుస్తుందా?: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఎంఎల్‌సి కవిత మండిపడ్డారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పంపిన జాబితాను ఆమోదించడం సంప్రదాయమని, ప్రభుత్వం పంపిన పేర్లను అనేక కారణాలు చెప్పి తిరస్కరించారన్నారు. తెలంగాణలో భారత రాజ్యాంగం నడుస్తుందా? బిజెపి రాజ్యాంగం నడుస్తుందా? అని కవిత ప్రశ్నించారు. బిసి వర్గాలకు తమ పారటీ పెద్దపీట వేస్తోందని, బిసి వర్గాలకు వ్యతిరేకంగా బిజెపి వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజ్యాంగ పదవుల్లో ఉండి ఇలా చేయడం సరికాదని కవిత దుయ్యబట్టారు. పలు రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని, గవర్నరే ఇలా వ్యవహరించడం దురదృష్టకరమైన విషయమన్నారు. రాజ్యాంగ వ్యవస్థలకు పరిధులు, పరిమితులు ఉంటాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News