Tuesday, July 1, 2025

నాపై అందుకే అన్ని మీమ్స్ వస్తాయి.. : కావ్య మారన్

- Advertisement -
- Advertisement -

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ (Kavya Maran) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫ్రాంచైజీకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో కావ్యకు అంతకంటే ఎక్కవ ఫ్యాన్స్ ఉన్నారు. సన్‌రైజర్స్ మ్యాచ్‌లు ఎక్కడ జరిగిన సరే ఆమె స్టాండ్స్‌లో ఉంటూ.. జట్టును ప్రొత్సహిస్తుంటారు. ఆ సందర్భంలో ఆమె హావభావాలను కెమెరామెన్లు వాటిని తన కెమెరాల్లో బంధిస్తుంటారు. ఇలా పలు సందర్భాల్లో కావ్య ఎక్స్‌ప్రషన్స్‌తో చాలా మీమ్స్ చేస్తుంటారు.

తాజాగా, ఈ మీమ్స్‌పై కావ్య (Kavya Maran) స్పందించారు. క్రికెట్ మీద తనకున్న ఇష్టం వల్లే కెమెరామెన్‌ తన హావభాలను కెమెరాలో బంధిస్తాడు. ఈ కారణంగానే నాపై ఎనో మీమ్స్ వస్తాయి. ఇక సన్‌రైజర్స్ జట్టు హైదరాబాద్‌లో ఆడినప్పుడు మాత్రమే కాదు.. ఎక్కడ ఆడినా అక్కడకు వెళ్లిన తన టీమ్‌ని సపోర్ట్ చేస్తానని చెప్పారు. ‘నేను ఎక్కడో చాలా చూరంలో కూర్చుంటాను. కానీ కెమెరామెన్ వెతికి మరి నా హావభావాలను బంధిస్తాడు. అవి మీమ్స్‌గా మారుతాయి’ అని కావ్య తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News