Tuesday, February 7, 2023

జాతీయ రాజకీయాల్లో ఇక ‘గులాబీ’ శకం

- Advertisement -

దూసుకొస్తున్న జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా
తీర్చిదిద్దుతున్న కెసిఆర్ జాతీయ చక్రం తిప్పనున్న మరో తెలుగు
బిడ్డ నాడు ఎన్‌టిఆర్.. నేడు చంద్రశేఖర్ రావు పార్టీ మారిన
తర్వాత కొత్త కార్యవర్గం ప్రచారం రెండు ఛానళ్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : నయా చరిత్రకు టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శ్రీకారం చుట్టబోతున్నారు. నూతన ఒరవడిని సృష్టించనున్నారు. దేశ రాజకీయాలను సరికొత్త పంథావైపు తీసుకొళ్లేందుకు శరవేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా మరో ఇరవై నాలుగు గంటల్లో దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించే విధంగా కీలక ప్రకటన చేయనున్నారు. ఎవరి ఊహలకు అంతుచిక్కని విధంగా, రాజకీయ పండితులు సైతం నివ్వరపోయే రీతిలో రాష్ట్రంలో పదేళ్లుగా అధికారం లో కొనసాగుతున్న టిఆర్‌ఎస్ పేరును మార్చి జాతీయ పార్టీగా తీర్చిదిద్దుతున్నారు. ఇలాం టి సాహసం ఇప్పటి వరకు దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయలేదు.

ఏ నాయకుడు కూడా ఆ ధైర్యం చేయలేదు. కానీ కెసిఆర్ ఒక్కరే… ఆ సాహాసం చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీని జాతీ య పార్టీగా నామకరణం చేసి సగర్వంగా దేశ రాజకీయాల్లోకి ప్ర భుత్వంపై ఇప్పటివరకు హైదరాబాద్ వేదికగా విమర్శలు గుప్పించిన కెసిఆర్ ఇక కేంద్ర ప్ర భుత్వంతో నేరుగా యుద్ధ్దం చేసేందుకు పూర్తి స్థాయిలో రెడీ అయ్యారు. ఇందుకు అవసరమై న అన్ని హంగులను సిద్ధం చేసుకున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి సా రిగా కెసిఆర్ నేతృత్వంలో జాతీయ రాజకీయ పార్టీ పురుడుపోసుకుంటున్నది. దీనికి దసరా పండుగ రోజున అంకురార్పణ జరుగుతోంది.

గతంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అన్ని పార్టీల ను తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత నేత ఎన్‌టిఆర్ ఏకంగా చేసి ఢిల్లీ పీ ఠాన్ని అంటిపెట్టుకుని పాలన సాగిస్తున్న కాం గ్రెస్‌ను అధికారంలో నుంచి దింపగలిగారు. త దనంతరం చంద్రబాబునాయుడు కూడా ఎన్‌టిఆర్ తరహాలోనే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసి మరోసారి ఆ పార్టీని అధికారం నుంచి దూరం చేయగలిగారు. వారి నేతృత్వం

లో దేశంలోని కాంగ్రెస్‌యేతర పార్టీలను ఏకమయి ఒక ఫ్రంట్‌గా ఏర్పడ్డాయి. అన్ని పార్టీలు కలిసే కాంగ్రెస్‌పై యుద్దం చేశారు. ఆ పార్టీని అధికారంలోకి రా కుండా నియంత్రించగలిగారు. అందులో అ న్ని రాజకీయ పార్టీలు తమవంతు పాత్ర పో షించాయి. అలాంటి ఫ్రంట్‌లతో కలిసి ఏర్పా టు చేసిన ప్రభుత్వాలు ఎక్కువ కాలం ఫ్రంట్ పార్టీల్లోనే సఖ్యత కొరవడడం వల్ల దేశంలో పలుమార్లు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఈ ప రిణామాలన్నీ దేశ ప్రజలకు అప్పట్లో తీవ్ర అసహనం తెప్పించాయి. ఫ్రంట్‌లపై విశ్వాసం కోల్పోయే విధంగా మారాయి.

వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే కెసిఆర్ తనతో కలిసి వచ్చే భావసారూప్యం గల పార్టీలను కలుపుకునే జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాల రాజకీయం ముందు పలు రాష్ట్రాల్లోని బిజెపియేతర పార్టీలు ధైర్యంగా ముందుకు వచ్చే పరిస్థితులు లేవు. అందుకే మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా దేశ రాజకీయాల్లో పెను మార్పులను తీసుకొచ్చే బాధ్యతలను కెసిఆర్ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులగా అనేక పార్టీల నేతలు, మాజీ ముఖ్యమంత్రులతో కెసిఆర్ వరసగా సంప్రదింపులు చేస్తున్నారు.వారంతా కెసిఆర్‌కు అండగా ఉంటామని స్పష్టం చేశారు. బిజెపియేతర పార్టీలు ఇచ్చిన మద్దతు, ప్రొత్సాహంతో కెసిఆర్ ఢిల్లీ రాజకీయాలపై సమర శంఖారావం పూరించేందుకు సమాయత్తమవుతున్నారు.

పేరు మారిన తర్వాత కార్యవర్గం ఏర్పాటు

టిఆర్‌ఎస్ పేరు జాతీయ పార్టీగా అవతరించిన తరువాత కార్యవర్గం ఏర్పాటు చేయాలని కెసిఆర్ భావిస్తున్నారు. పార్టీ పేరు మారే వరకు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్‌కుమార్ నేతృత్వంలోని ఒక బృందం ఫాల్‌అప్ చేస్తుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కెసిఆర్ ఉంటారు. పార్టీ పేరు మారి, కేంద్ర ఎలక్షన్ కమిషన్‌కు సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యాక జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించి పూర్తి స్థాయి కార్యవర్గాన్ని, పొలిట్ బ్యూరోను నియమిస్తారు.

ప్రచారం కోసం రెండు జాతీయ ఛానెళ్లు

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కెసిఆర్…. కొత్తగా ఏర్పాటు చేస్తున్న జాతీయ పార్టీ పక్షాన రెండు ఛానెళ్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు తరముకొస్తున్న నేపథ్యంలో పార్టీని అన్ని రాష్ట్రాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లవిధంగా ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పార్టీని ప్రజల ముంగిటకు తీసుకెళ్లాలని కెసిఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ కేంద్రంగా ఒక ఇంగ్లీష్, హిందీ ఛానెళ్లను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ స్థాయి నాయకులు కొందరు ఇప్పటికే కెసిఆర్‌కు సూచించారని తెలుస్తోంది. ఇందుకు కెసిఆర్ కూడా అనుకూలంగా ఉండడంతో రెండు ఛానెళ్ల కోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారని తెలుస్తోంది. కొత్త ఛానెళ్ల కోసం శాటిలైట్ అనుమతులు తీసుకోవాలా? లేక ఇప్పటికే అనుమతులు ఉన్న ఛానెళ్లతోనే ఒప్పందం చేసుకుని ముందుకు వెళ్లాలా? అన్న అంశంపై తనకు సన్నిహితంగా ఉండే నేతలతో కెసిఆర్ మంతనాలు జరుపుతున్నారు. అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ ఛానెళ్లతో కూడా ఒప్పందాలు చేసుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles