Tuesday, April 23, 2024

మోడీజీ.. ఇది తప్పు

- Advertisement -
- Advertisement -

KCR opposes changes to IAS rules for deputation to Centre

అఖిల భారత సర్వీసుల సవరణ సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు
దొడ్డిదారి ప్రతిపాదనలతో రాష్ట్రాల హక్కులను హరించొద్దు
మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి : ప్రధానికి సిఎం కెసిఆర్ లేఖ

ఆలిండియా సర్వీసెస్ (కేడర్) నిబంధనలకు ప్రతిపాదిత సవరణలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయి. సమాఖ్య స్ఫూర్తికి అవి విరుద్ధం. అందుకే ప్రతిపాదిత సవరణలను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేంద్రం చేస్తున్న పని రాష్ట్రాల పరిపాలనలో వేలు పెట్టేలా ఉంది. అంతేకాకుండా ఐఎఎస్ అధికారులను గుప్పిట్లోకి తెచ్చుకునేలా కనిపిస్తోంది.

ఎఐఎస్ నిబంధనలను సవరించడం అంటే రాజ్యాంగాన్ని సవరించడమే రాష్ట్రాల ఆకాంక్షలకు విఘాతం కలగకుండా వాటి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆర్టికల్ 368 (2)లో ఈ అంశాన్ని రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో పొందుపరిచారు. సవరణలు దొడ్డిదారిన కాకుండా పార్లమెంటు ఆమోదంతో చేసే దమ్ము కేంద్రానికి ఉందా?

ఎఐఎస్ నిబంధనల సవరణ రాష్ట్రాలను
నామమాత్రం చేయడమే కేంద్రం
వేధింపులకు మీ నిర్ణయం ఉసిగొల్పుతోంది
ఐఎఎస్‌ల పనితీరుపై తీవ్ర ప్రభావం
చూపుతోంది రాష్ట్రాల ఆకాంక్షలకు విఘాతం
కలగకుండా చూడాలి రాష్ట్రాల్లో
సమర్థవంతంగా పనిచేస్తున్న
అధికారులను
నియంత్రణలోకి తెచ్చుకోవడం,
ఒత్తిడికి గురిచేయడమే

పార్లమెంటులో సవరణ చేసే సత్తా ఉందా?

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంపై మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశా రు. ఆలిండియా సర్వీసెస్ (క్యాడర్) నిబంధనల సవరణ పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత సవరణను దొడ్డిదా రిన గాకుండా కేంద్ర ప్రభుత్వానికి ధైర్యముంటే పార్లమెంటు ప్రక్రియ ద్వారా సవరించా లన్నారు. ఈ మేరకు సోమవారం ప్రధాన మం త్రి నరేంద్రమోడీకి ఒక లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ సవరణలు రాష్ట్రాల హక్కులనుహరించేలా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఈ నిబంధనల సవరణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సిఎం డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు ఇష్టం లేకున్నా ఐఎఎస్‌లను కేంద్ర సర్వీసుల్లోకి తీసుకునేలా కేడర్ రూల్స్ మార్చాలన్న కేంద్రప్రభుత్వ ప్రతిపాదనలు ఏ మాత్రం సమంజసం కాదన్నారు.ఈ సవరణలు ఏ రకంగా చూసినా రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఇవి ఐఎఎస్, ఐపిఎస్,ఐఎఫ్‌ఎస్‌ల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉన్నాయని అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తున్నదన్నారు.

రాష్ట్రాల్లో ఎఐఎస్ అధికారులు నిర్వర్తించే క్లిష్టమైన ప్రత్యేక బాధ్యతల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు లేనిదే బదిలీపై కేంద్రం నిర్ణయం తీసుకోవడం హేతుబద్ధ్దకంగా లేదన్నారు. ఇది రాష్ట్రాల పరిపాలనలపై తీవ్ర ప్రభావం చూపుతుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ స్వరూపానికి,సహకార సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అని ఆ లేఖలో వ్యాఖ్యానించారు. పైగా కేంద్రం ప్రతిపాదించిన సవరణల ద్వారా రాష్ట్రాలు గుర్తింపు లేకుండా పోవడమే కాకుండా నామమాత్రపు వ్యవస్థలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉన్నదని సిఎం కెసిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదిత సవరణలు రాష్ట్రాల్లో పనిచేసే అధికారులపై పరోక్ష నియంత్రణను అమలుచేసే ఎత్తుగడ అని ఆరోపించారు.

అధికారులను తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ సవరణపై దృష్టి సారించిందని సిఎం అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలో కేంద్రం తలదూర్చడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ఎఐఎస్ అధికారులను బాధ్యులుగా, జవాబుదారులుగా చేయాల్సిందిపోయి..వారిని మరింత నిరుత్సాహానికి గురిచేయడమే అవుతుందన్నారు. కేంద్రం చేత వేధింపుల దిశగా ఈ సవరణ ఉసిగొల్పుతుందన్నారు. ఈ విధానం ఎఐఎస్ అధికారుల ముందు రాష్ట్రాలను నిస్సహాయులుగా నిలబెడుతుందన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 312 లోని నిబంధనల ప్రకారం ఆల్ ఇండియా సర్వీసెస్1951 చట్టాన్ని పార్లమెంటు చేసిందని, దాని ప్రకారం భారత ప్రభుత్వం పలు నిబంధనలను రూపొందించిందని తాను అంగీకరిస్తున్నానని సిఎం కెసిఆర్ తెలిపారు. కాని రాష్ట్రాల ఆకాంక్షలను కాలరాసే విధంగా దేశ సమాఖ్య రాజనీతిని పలుచన చేసే దిశగా ఎఐఎస్ క్యాడర్ రూల్స్‌కు రంగులద్దుతూ ఉద్దేశపూర్వకంగా చేసిన సవరణను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని మోడీకి రాసిన లేఖలో సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.
ఇది ఎఐఎస్ క్యాడర్ రూల్స్ 1954 సవరణ ఎంత మాత్రం కాదని, ఈ సవరణ కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు సంబంధించి భారత రాజ్యాంగాన్ని సవరించడమే తప్ప మరోటి కాదన్నారు. రాష్ట్రాల ఆకాంక్షలకు విఘాతం కలుగకుండా ఉండాలంటే, రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొన్న తర్వాతే రాజ్యాంగ సవరణలు చేపట్టాలన్నారు. ఈ నిబంధనను ఆర్టికల్ 368 (2) లో రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో పొందుపరిచారని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ గుర్తు చేశారు.

ఎఐఎస్ క్యాడర్ రూల్స్ సవరణల ద్వారా కేంద్రం రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలపడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని కెసిఆర్ అన్నారు. ఈ సవరణ కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉండే పరిపాలన పరమైన ఎఐఎస్ ఉద్యోగుల పరస్పర సర్దుబాటుకు గొడ్డలిపెట్టుగా మారుతుందన్నారు. ఈ సవరణ ప్రతిపాదనలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలకు మరింత విఘాతం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఎఐఎస్ అధికారులను రాష్ట్రాల్లో సామరస్యతతో, చక్కని సమతుల్యతతో వినియోగించుకోవడానికి ప్రస్తుతం అమలులో ఉన్న ఎఐఎస్ క్యాడర్ రూల్స్ సరిపోతాయన్నారు. ఈ నేపథ్యంలో పరిపాలనా పరమైన పారదర్శకతను, రాజ్యాంగం ప్రవచించిన సమాఖ్య స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. దీనికిప్రస్తుతం కేంద్రం చేపట్టిన ప్రతిపాదిత సవరణలను నిలిపివేయాలని ఈ సందర్భంగా తాను కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఆ లేఖలో సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News