Monday, May 6, 2024

కెసిఆర్ ఎన్నడూ భయపడలేదు..

- Advertisement -
- Advertisement -

మిర్యాలగూడ : భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బస్సు యాత్ర కొనసాగుతోంది. మిర్యాలగూడ రోడ్ షోలో కెసిఆర్ బుధవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సిఎం కెసిఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతుబంధులో దగా.. రైతుబీమా ఉంటుందో.. ఊడుతుందో తెలియదన్నారు. బిఆర్ఎస్ హయాంలో రెప్పపాటు కూడా విద్యుత్ పోలే.. బిఆర్ఎస్ హయాంలో మిగులు విద్యుత్ ఉండేలా చేశామన్నారు. మిషన్ భగీరథను సరిగా నడపలేని పరిస్థితి ఈ ప్రభుత్వానిదని కెసిఆర్ మండిపడ్డారు.

రైతుబంధు ఇవ్వాలని కోరితే చెప్పుతో కొడతానని ఓ మంత్రి చెప్పారు. చెప్పులు మంత్రి దగ్గరనే కాదు రైతుల దగ్గర కూడా ఉంటాయని హితువు పలికారు. ప్రాజెక్టులను కెఆర్ఎంబికి అప్పగించారు. సాగర్ ఆయకట్ట కింద పంటలను ఎండపెట్టారని ద్వజమెత్తారు. నన్న తిట్టి పబ్బం గడుపుకోవడే మంత్రుల పని అన్నారు. రైతులకు ఏటా బడ్జెట్ లో రూ. 15 వేల కోట్లు పెట్టామని కెసిఆర్ గుర్తుచేశారు.

మద్దతు ధరకు పంటలు కొని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని కెసిఆర్ వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. బిఆర్ఎస్ గెలిస్తే ప్రభుత్వం మెడలు వంచి అన్ని పనులు చేపడతామని పేర్కొన్నారు. కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామంటున్నారు.. జైలుకు వెళ్లేందుకు కెసిఆర్ ఎన్నడూ భయపడలేదని హెచ్చరించారు. కెసిఆర్ భయపడితే తెలంగాణ వచ్చేదా?.. బోగస్ మాటలతో ఆరు హామాలకు పంగనామం పెట్టారని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News