Sunday, August 31, 2025

కెసిఆర్ రాజీనామా చేయాలి: సిపిఐ నారాయణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు (కెసిఆర్) తక్షణమే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ తరుణంలో ముఖ్యమైన అంశాలపై చర్చ జరుగుతున్నప్పటికీ కెసిఆర్ గైర్హాజరై ఉండటం బాధ్యత రాహిత్యమని ఆయన వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టబడి, కాలేశ్వరం ప్రాజెక్టు పై రిపోర్ట్ సమర్పించబడి జరిగిన కీలక చర్చల్లోనూ కెసిఆర్ అసెంబ్లీకి హాజరుకాకుండా ఫాం హౌస్‌లో నాటకాలు ఆడుతున్నారా? అంటూ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన అభినందించారు. ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి, కేంద్రానికి పంపించి ఆమోదం పొందాలని కోరారు. సిపిఐ తరపున రేవంత్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు డాక్టర్ నారాయణ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News