Monday, May 6, 2024

పాలేరు నియోజకవర్గం మొత్తం దళితబంధు అమలు చేస్తాం: కేసీఆర్

- Advertisement -
- Advertisement -

అవకాశాల కోసం పూటకో పార్టీ మారే వారిని నమ్మి ఓటు వేయొద్దని.. పార్టీల వైఖరిని పరిశీలించి ప్రజలు ఓట్లు వేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. శుక్రవారం పాలేరు నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగిచారు.

“రాష్ట్ర సంపద పెరిగే కొద్దీ.. సంక్షేమ పథకాలు పెంచుతున్నాం. రైతుబంధును పుట్టించి రైతులకు ఎదురు డబ్బులు ఇస్తున్నాం. రైతుబంధును వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ తోపాటు ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసించింది. రైతుల బాధలు నాకు తెలుసు కాబట్టే రైతుబంధు తెచ్చాను. రైతుబంధు ఉండాలో.. వద్దో.. తెలంగాణ ప్రజుల నిర్ణయించుకోవాలి. రైతుబంధు, కరెంటు వద్దు అనే కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. కాంగ్రెస్ గెలిస్గే.. రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్ అంటారు.

ధాన్యం దిగుబడిలో పంజాబ్ తర్వాత స్థానానికి తెలంగాణ చేరుకుంది. పోలీస్ స్టేషన్లలో ఎరువులు అమ్మిన చరిత్ర కాంగ్రెస్ ది. సీతారామా ప్రజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లాలో కరువు ఉండదు. డబ్బు కట్టల అహంకారంతో వచ్చేవారికి అవకాశం ఇవ్వొద్దు. డబ్బు కట్టలతో ప్రజలను కొంటామనుకనే వారికి బుద్ధి చెప్పాలి. తుమ్మల నాగేశ్వర్ రావు, పువ్వాడ అజయ్ చేతిలో ఓడిపోయి మూలకు కుర్చున్నారు. స్నేహితుడనే ఉద్దేశంతో ఓడిపోయిన వ్యక్తిని పిలిచి మంత్రి పదవి ఇచ్చాను. బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందో.. బీఆర్ఎస్ కు తుమ్మల అన్యాయం చేశారో ఆలోచించాలి. పాలేరు నియోజకవర్గం మొత్తం దళితబంధు అమలు చేస్తాం” అని సిఎం కెసిఆర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News