Wednesday, May 1, 2024

తెలంగాణలో రానున్న రోజులు మనవే: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగానలో రాజకీయ గందరగోళం నెలకొంటుందని మాజీ సిఎం కెసిఆర్ అన్నారు. ఎన్నికల తర్వాత ఏం జరిగినా బిఆర్ఎస్ కే మేలు జరుగుతుందన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ నేతలతో కెసిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్ సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలు కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. లోక్ సభ అభ్యర్థులకు బి-ఫామ్ లు, ఎన్నికల ఖర్చు చెక్కలను కెసిఆర్ అందించారు.

అనంతరం కెసిఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. బిఆర్ఎస్ నేతలు. రైతు సమస్యలు అజెండాగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని సూచించారు. కొందరు నేతలు వెళ్లినంత మాత్రాన బిఆర్ఎస్ కు నష్టం ఏం లేదని చెప్పారు. త్వరలో బస్సు యాత్రతో ప్రజల్లోకి వస్తానన్నారు. ఈరోజు రూట్ మ్యాప్ ఖరారవుతుందని తెలిపారు.ఉద్యమం కాలం నాటి కెసిఆర్ ను మళ్లీ చూస్తారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News