Thursday, September 18, 2025

ఈ నెల 15నుంచి కెసిఆర్ జిల్లాల పర్యటనలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈనెల 15వ తేదీ నుంచి సిఎం కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు జిల్లాల్లో పర్యటించనున్నారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో సిఎం కెసిఆర్ ఎన్నికల ప్రాచారానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 15 బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో సిఎం కెసిఆర్ ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. అనంతరం వారికి బీఫారాలు అందజేయడంతోపాటు బిఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.

ఈ నెల 15 నుంచి జిల్లాల్లో కెసిఆర్ విస్తృతంగా పర్యటించనున్నారు.15న హుస్నాబాద్, 16న జనగామ, భువనగిరిలో, 17న సిద్దిపేట, సిరిసిల్లలో, 18న జడ్చర్ల, మేడ్చెల్ లో కెసిఆర్ సభలు నిర్వహించనున్నారు. ఇక, నవంబర్ 9న కోనాయపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం గజ్వేల్, కామారెడ్డిలో కెసిఆర్ నామినేషన్లు వేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News