Saturday, December 14, 2024

కేదార్ నాథ్ ఆలయం తలుపులు మూసివేత

- Advertisement -
- Advertisement -

శీతాకాలం ప్రవేశించడంతోపాటు వైదిక సంప్రదాయ విధానాల సందర్భంగా కేదార్‌నాథ్ ఆలయం తలుపులు ఆదివారం మూసివేశారు. ఈ సందర్భంగా 18 వేల మంది యాత్రికులు దర్శనం చేసుకున్నారు. ఆలయం తలుపుల మూసివేత ఆదివారం తెల్లవారు జామున 4 గంటలకు ప్రారంభమై, ఉదయం 8.30 గంటలకు ముగిసిందని బదిరీనాథ్ కేదారినాథ్ ఆలయ కమిటీ (బీకేటిసి) మీడియా ఇన్‌ఛార్జి హరీష్ గౌర్ వెల్లడించారు. ఈ యాత్రా సీజన్‌లో 16.5 లక్షల మంది కన్నా ఎక్కువ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించి ఆరాధనలు చేశారని బీకేటిసి ఛైర్మన్ అజేంద్ర అజయ్ చెప్పారు. తలుపులు మూసివేసే ముందు పాలంక్విన్ లోని ఆలయం నుంచి శివుని విగ్రహాన్ని ఓంకారేశ్వర ఆలయానికి తరలించారు. శీతాకాలంలో అక్కడనే ఆరాధనలు జరుగుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News