Friday, May 3, 2024

స్టైలిష్ లుక్‌లో

- Advertisement -
- Advertisement -

Keerthi suresh look release from Sarkaru Vari pata

 

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాపై ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతోంది. మహేష్ బాబు, కీర్తి సురేష్‌తో పాటు ఇతర తారాగణం అంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఆదివారం కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె లుక్‌ను విడుదల చేశారు. గతంలో చీరకట్టులో సంప్రదాయ లుక్‌లో కనిపించిన కీర్తి, తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చింది. డెనిమ్ జాకెట్ ధరించి చిరునవ్వులు చిందిస్తూ కీర్తి మెరిసింది. ఎంతో ప్రతిష్టాత్మక ంగా ఈ ‘సర్కారు వారి పాట’ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2022 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 13న రిలీజ్ చేయనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News