హైదరాబాద్: యెమెన్‌లో కేరళ నర్సు నిమిషా ప్రియా ఉరిశిక్ష వాయిదా పడింది. వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహదీని హత్య చేసిన కేసులో నిమిషాకు యెమెన్ కోర్టు జులై 16న ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చర్చల నేపథ్యంలో చివరి క్షణంలో కేరళ నర్సు నిమిషా ఉరిశిక్షను నిలిపివేస్తూ యెమెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహదీ కుటుంబం, గిరిజన నాయకులతో కంఠాపురం ఎపి అబూబకర్ ముస్లియార్ చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంతపురం ఎపి అబూబకర్ ముస్లియార్ జోక్యం చేసుకోవడంతోనే నిమిషప్రియను విడుదల చేయడానికి యెమెన్ లో అనధికారిక చర్చలు ప్రారంభమయ్యాయి. చివరి క్షణంలో కూడా ఉరిశిక్షను ఆపాలని భారత ప్రభుత్వం యెమెన్ ప్రభుత్వాన్ని కోరింది. బాధితుడి కుటుంబానికి రూ. 11 కోట్ల బ్లడ్ మనీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం. చివరిక్షణంలో ఉరిశిక్షను వాయిదా వేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కేరళలోని పాలక్కాడ్ చెందిన నిమిష ప్రియా ఉపాధి నిమిత్తం యెమెన్‌లో నర్సుగా సేవలందిస్తోంది. తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తి పరిచయడం కావడంతో అతడితో కలిసి వ్యాపారం ప్రారంభించింది. వ్యాపారంలో ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో ఆమెను అమెను మహదీ వేధించాడు. వేధింపులు శృతి మించడంతో అతడిని ఆమె 2017లో మత్తు ఇంజక్షన్ తో చంపేసింది. అనంతరం అతడి శరీర భాగాను భూగర్భ ట్యాంక్ లో పడేసింది. యెమెన్ కోర్టు 2020లో ఆమెకు ఉరిశిక్షను ఖరారు చేశాయి. ఆమె ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆమె అప్పీల్‌ను 2023లో ఉన్నత న్యాయం స్థానం తిరస్కరించింది. దీంతో ఆమెకు జులై 16న ఆమెను ఉరి తీయనున్నారు. ప్రస్తుతం ఆమె సనా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.