Saturday, April 27, 2024

గవర్నర్లపై ‘గరం’…’గరం’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రేపటి నుంచి ప్రారంభం కానున్న కేంద్రంబడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు ఏ మాత్రం అన్యా యం జరిగినా సహించబోమని బిఆర్‌ఎస్ పార్టమెంటరీ పార్టీ నేతలు కె. కేశవరావు (రాజ్యసభ), నామా నాగేశ్వర్‌రావు (లోక్‌సభ)లు స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రాన్ని తీవ్ర స్థా యిలో ఎండగడతామన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని ప్రధాన అంశాలను పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, తెలంగాణపై కుట్రలను సైతం ఎండగడతామని వారు పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో కేశవరావు, నామా నాగేశ్వర్‌రావులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడూతూ, అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించినట్లు తెలిపారు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత, రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీలపై అఖిల పక్ష సమావేశం లో చర్చకు పట్టుబడతామన్నారు.

నిరుద్యోగం, ధరల పెరుగుదల, మహిళ రిజర్వేషన్ బిల్లు అంశాలను బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తుతామన్నారు. కేవలం బిల్లుల ఆమోదం మీదనే కాకుండా దేశ సమస్యలపై దృష్టి పెట్టాలని కేంద్రానికి చెప్పామని తెలిపారు. ఎస్‌బిఐ, ఎల్‌ఐసి షేర్లు పడిపోయిన అంశాన్ని కూడా ఉభయ సభల్లే లేవనెత్తుతామని వారు పేర్కొన్నారు.అయితే బడ్జెట్ సమావేశాల దృష్ట్యా సజావుగా సభలు సాగేందుకు సహకరించాలని విపక్షాలను కేంద్రం కోరిందన్నారు.దేశ సమస్యలపైనా, గవర్నర్ వ్యవస్థపై చర్చ జరగాలని కూడా భేటీలో కోరామన్నారు. గవర్నర్ చర్యల కారణంగానే గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఆమోదానికి న్యాయస్థానం సహాయం తీసుకుంటోందన్నారు.

ప్రభుత్వంలో గవర్నర్ జోక్యం, పాత్ర ఎక్కువవుతుందన్నారు. బిల్లులను పెండింగ్ లో పెట్టుకుంటూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. బడ్జెట్ ను ఆమోదించను అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడవకుండా చేయడమేనని అన్నారు. తమిళనాడు, కేరళలో గవర్నర్ల పరిస్థితి చూస్తున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాలను ప్రొరోగ్ చేయనప్పుడు గవర్నర్‌ను పిలవాల్సిన అవసరం లేదన్నారు. కావాలనే రాజ్యాంగ సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు.ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు ఉన్నాయనే ఈ సమస్య అన్నారు.కోపరేటివ్ ఫెడరలిజం అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్ కట్ చేయాలా? వద్దా? అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ అంశంపై త్వరలోనే స్పష్టత ఇస్తామని కేశవరావు , నామాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News