Sunday, April 28, 2024

ఆప్‌కు నిధులు సమకూర్చిన ఖలిస్తానీ గ్రూపులు

- Advertisement -
- Advertisement -

2014-22 మధ్య రూ.133.54 కోట్ల సాయం
ఖలిస్తానీ ఉగ్రవాది పన్నున్ ఆరోపణ

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి 2014 నుంచి 2022 వరకు రూ. 133.54 కోట్ల ఆర్థిక సహాయాన్ని ఖలిస్తానీ గ్పూలు అందచేసినట్లు ఖలిస్తానీ ఉగ్రవాది గుర్‌పట్వంత్ సింగ్ పన్నున్ ఆరోపించాడు. ఇందుకు బదులుగా 1993 ఢిల్లీ బాంబు పేలుడు కేసులో దోషిగా తేలి జైలుపాలైన ఖలిస్తానీ ఉగ్రవాది దేవీందర్ పాల్‌సింగ్ భుల్లర్‌ను విడుదల చేయిస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారని పన్నున్ ఆరోపించాడు. ఇందుకు సబంధించిన పన్నున్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 1993లో జరిగిన ఢిల్లీ బాంబు పేలుడు ఘటనలో 9 మంది మరణించగా 31 మంది గాయపడ్డారు. సిక్కు వేర్పాటువాద నాయకుడైన పన్నున్ గతంలో భారత్‌కు తీవ్ర హెచ్చరికలు జారీచేశాడు. పార్లమెంట్‌ను పేల్చివేస్తామంటూ బెదిరింపులకు ఆపల్పడ్డాడు. అయితే పన్నున్ హత్యకు భారత్ కుట్రపన్నినట్లు అమెరికా గతంలో ఆరోపించింది. ఈ కుట్ర వెనుక భారత గూఢచారి ఏజెంట్లు ఉన్నట్లు తమ అంతర్గత దర్యాప్తులో తేలినట్లు కూడా అమెరికా ఆరోపించింది. కాగా&ఈ ఆరోపణలను భారత్ అప్పట్లోనే ఖండించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News