- Advertisement -
రాజాపూర్: పూరి యువకుడి ప్రాణం తీసిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఖానాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బ్యాగరి కుమార్(26) అనే రైతు గత కొంత కాలంగా తిర్మలాపూర్‌లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం పొలం వద్ద పూరి తింటుండగా గొంతులో ఇరుక్కొంది. వెంటనే స్పృహతప్పి పడిపోవడంతో వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పూరి గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక మృతి చెందాడని వైద్యులు వివరించారు. కుమార్‌కు ఇంకా పెళ్లి కాలేదు. ఖానాపూర్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
- Advertisement -