Friday, April 19, 2024

ఇది యుద్ధం అంతమైన ఆనందం

- Advertisement -
- Advertisement -

 

ఖేర్సన్ : ఇది యుద్ధం అంతానికి ఆరంభం, రష్యా ప్రాబల్య ముగింపునకు తొలిదశ అని ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా చెర నుంచి విముక్తి పొందిన ఖేర్సన్‌లో స్థానికుల ఆనందోత్సహాల నడుమ జెలెన్‌స్కీ ఇక్కడికి వచ్చారు. సోమవారం ఇక్కడి ప్రజలతో, సైనికులతో ముచ్చటించారు. క్రమేపీ రష్యా బలగాలు అన్ని ప్రాంతాల నుంచి వైదొలుగుతున్నాయని, ఇది యుద్ధం ముగిసే దశకు సంకేతం అని తెలిపారు. అయితే రష్యా బలగాలను తిప్పికొట్టే దశలో ఉక్రెయిన్ సైనిక సోదరులు ప్రదర్శించిన ధైర్యం వారి త్యాగాలు ఎనలేనివని కొనియాడారు.

శత్రువును దెబ్బతీసే క్రమంలో మన సైనికులు మూల్యం చెల్లించుకోవల్సి వస్తోందని, వారు ప్రాణాలు కోల్పోవల్సి వచ్చినా శత్రువును వెనకకు తరిమికొడుతున్నారని , ఇప్పటి ఖేర్సన్ విముక్తి ఉత్సవాలు ఓ అంతానికి ఆరంభం అని వ్యాఖ్యానించారు. ఖేర్సన్‌ను తిరిగి కైవసం చేసుకోవడం ఈ తొమ్మిదినెలల యుద్ధంలో ఉక్రెయిన్ సాధించిన ఘన విజయం అని తెలిపారు. రష్యా సేనలు వైదొలుగుతున్న దశలో ఖేర్సన్‌లో పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఇక్కడ జరిగిన విధ్వంసం, జనంపై అమానుషం నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన మానవీయ సహాయక చర్యలపై స్థానిక అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సి వచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News