Monday, May 13, 2024

పౌరులపై దాడి చేస్తే బందీల వధ

- Advertisement -
- Advertisement -
ఇజ్రాయెల్‌కు హమాస్ హెచ్చరిక

గాజాస్ట్రిప్‌లోని పౌరులపై దాడులు కొనసాగిస్తే ఊరుకునేది లేదని హమాస్ ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది. తమ వద్ద పలు దేశాలకు చెందిన వారు , ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉన్నారని, ఇప్పటికీ దాడులు సాగితే ఒక్కోదాడికి ప్రతిగా ఒక్కో ఇజ్రాయెల్ బందీని చంపివేస్తామని హమాస్ హెచ్చరించింది. ఇదే జరిగితే ఇక ఎటువంటి ఆలోచనలు లేకుండా మొత్తం గాజాస్ట్రిప్‌ను నామరూపాలు లేకుండా చేయడం జరుగుతుందని ఇజ్రాయెల్ సైనికాధికారులు తిరుగు జవాబు ఇచ్చారు. దీనితో పాలస్తీనియన్లు ప్రాణభయంతో గడుపుతున్నారు.కాగా ఓ వ్యవసాయ క్షేత్రంలో హమాస్ వంద మంది బందీలను చంపివేసిన విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. తమ దేశంలోకి చొచ్చుకుని వచ్చి అరాచకాలకు దిగిన దాదాపు 1500 మంది హమాస్ మిలిటెంట్లను మట్టుపెట్టినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. తాము ఇప్పుడు పూర్తి స్థాయిలో గాజాస్ట్రిప్ దక్షిణ ప్రాంతం సరిహద్దులలో ఆధిక్యతను సాధించున్నామని ఇజ్రాయెల్ పేర్కొంది. తమ సైన్యం పూర్తిగా సన్నద్ధంగా ఉందని, అవసరం అయినప్పుడు రంగంలోకి దింపేందుకు 3 లక్షల మంది వరకూ అత్యవసర సైనికులను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. కాగా గాజాస్ట్రిప్ భూభాగం పూర్తిగా తమ కైవసం చేసుకునే దిశలో సైనిక దళాలను పంపించి, దాడులకు దిగాలా? అనే విషయంపై సైన్యం ఆలోచిస్తోంది. ఇంతకు ముందు ఇటువంటి గ్రౌండ్‌లెవల్ అటాక్ 2014లో జరిగిందని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి ఒక్కరు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News