Sunday, November 3, 2024

నాపై ట్రోలింగ్ ఎందుకు చేశారు: కిరణ్ అబ్బవరం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తనపై ఓ సినిమాలో ట్రోలింగ్ ఎందుకు చేశారని హీరో కిరణ్ అబ్బవరం ప్రశ్నించారు. తనపై ట్రోలింగ్ చేయాల్సి అవసరం ఏముందని అడిగారు. తనపై సినిమాలో చేస్తున్నప్పుడు తన సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘క’ సినిమాలో హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఫ్రీ రిలిజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగ చైతన్య, నిర్మాత ఎస్‌కె ఎన్ ముఖ్య అతిథులు హజరయ్యారు. ఈ సందర్భంగా అబ్బవరం ఎమోషనల్‌గా మాట్లాడారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు తనపై సామాజిక మాద్యమాల్లో ట్రోలింగ్‌పై స్పందించారు. తాను నటించిన సినిమాలు కొన్ని ప్రేక్షకులకు నచ్చాయ్, మరి కొన్ని నచ్చలేదు అని, తనతో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అని కిరణ్ ప్రశ్నించారు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చానని, తన పని ఏదో చేసుకుంటూ వెళ్తున్నానని వివరణ ఇచ్చారు. తనపై ట్రోలింగ్ చేయడమనేది చాలా బాధగా ఉందని కిరణ్ పేర్కొన్నారు. ఇప్పుడు తాను ప్రశ్నించినందుకు తనపై పగపడుతారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News