Thursday, May 16, 2024

పాపం పాల్

- Advertisement -
- Advertisement -

పార్టీ గుర్తు పాయే, గుర్తింపు పోయే
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆయన రాజకీయ హడావుడి అంతా ఇంతా కాదు. దేశంలోని వివిధ పార్టీల అధినేతల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల దాకా ఎవరినీ వదలకుండా నాన్ స్టాప్ విమర్శలు చేస్తూ సోషల్ మీడియా స్టార్ అయ్యారు. ముగ్గురు బాడీ గార్డులు, ఖరీదైన వాహనాల కాన్వాయ్‌తో ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షమవుతూ ప్రింట్, సోషల్, యూ ట్యూబ్, ఎలక్ట్రానిక్ మీడియాను ఊపేశాడు. గల్లీ నుంచి ప్రపంచం దాకా తనకు తెలియని విషయాలు, తెలియని నేతలు లేరం టూ ఎడాపెడా ఇంటర్వూలు ఇచ్చేవారు. తనను మించిన నేత లేరంటూ పదే పదే చెప్పుకునే వారు. కాని నేడు ఆయ న ఎన్నికల పోటీ నుంచి మాయమయ్యారు. ఆయన పార్టీ పేరు ప్రజాశాంతి.

దానికి అధినేత కె.ఎ. పాల్ పరిచయం అక్కర్లేని పేరు. రాష్ట్రంలో, దేశంలో అధికారం కోసం ఆయన చేసిన హంగామా అంతా, ఇంతా కాదు. అసెంబ్లీ ఎన్నికల ముందు 119 నియోజక వర్గాల అభ్యర్థులు రెడీ అయ్యారని ప్రకటించా రు. అంతకు ముందు మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసి పోలింగ్ బూత్‌ల దాకా తిరిగాడు. కాని నామమాత్ర ఓట్లు వచ్చాయి. అయినా, పట్టువదలని విక్రమార్కుడిలా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. కాని చావు కబురు చల్లగా వచ్చినట్లుగా ఆయన పార్టీ గుర్తింపునే కేంద్ర ఎన్నికల సంఘం పని తీరు ఆధారంగా రద్దు చేసింది. గతంలో కేటాయించిన హెలికాప్టర్ గుర్తు పోయింది. పార్టీ గుర్తింపు కూడా పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News