Friday, January 27, 2023

వైభవంగా రాహుల్‌-అతియా శెట్టి పెళ్లి

- Advertisement -

ముంబై: టీమిండియా స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్ ఓ ఇంటి వాడయ్యాడు. తన ప్రియురాలు, బాలీవుడ్ నటుడు స్టార్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల తనయ అతియా శెట్టిని రాహుల్ సోమవారం వివాహమాడాడు. ఖండాలాలోని సునీల్ శెట్టికి చెందిన ఫామ్ హౌజ్‌లో వీరి వివాహం వైభవంగా జరిగింది.

KL Rahul getting married Athiya Shetty

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, క్రికెటర్ ఇషాంత్ శర్మ దంపతులు, వరుణ్ అరోన్ తదితరులు ఈ పెళ్లికి హాజరయ్యారు. కివీస్‌తో సిరీస్ నేపథ్యంలో భారత క్రికెటర్లు రాహుల్ పెళ్లికి రాలేక పోయారు. ఐపిఎల్ ముగిసిన తర్వాత రాహుల్‌అతియా శెట్టిల రిసెప్షన్ జరిగే అవకాశాలున్నాయి. కాగా ఈ పెళ్లికి రాహుల్, అతియా శెట్టిలకు చెందిన కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles