Friday, September 20, 2024

ఆ షో నా జీవితాన్ని మార్చేసింది: రాహుల్

- Advertisement -
- Advertisement -

ముంబై: నాలుగేళ్ల క్రితం ప్రముఖ బాలీవుడ్ టివి షో కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో స్టార్ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కెఎల్ రాహుల్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదం తర్వాత ఇటు రాహుల్ అటు హార్దిక్‌లు ఎన్నో విమర్శలను ఎదుర్కొవాల్సి వచ్చింది. కాగా, ఈ వివాదంపై తాజాగా కెఎల్ రాహుల్ స్పందించాడు. ఈ సందర్భంగా అతను కీలక వ్యాఖ్యలు చేశాడు. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్‌తో తన జీవితం మారిపోయిందన్నాడు. ఆ వివాదం తనను ఎంతో మనోవేదనకు గురి చేసిందన్నాడు. చాలా రోజులు నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చిందన్నాడు.

కాగా, ప్రముఖ పారిశ్రామికవేత్త, జిరోదా సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో రాహుల్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా 2019 నాటి వివాదంపై కూడా స్పదించాడు. అప్పట్లో నాపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. కూర్చున్నా..నిల్చున్నా ట్రోల్స్ చేశారు. ఆ ఇంటర్వూ వ్యక్తిగతంగా నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సాధారణంగా నేను మృదుస్వభావం కలిగిన వ్యక్తిని. టీమిండియాలో చేరిన తర్వాతే ఆత్మవిశ్వాసం పెరిగింది. అంత సాఫీగా సాగుతున్న క్రమంలో తనకు కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ తనను ఇబ్బందుల్లోకి నెట్టిసిందన్నాడు. ఈ వివాదం నుంచి బయటపడేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని రాహుల్ వివరించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News