Sunday, December 15, 2024

సిఎం ఇలాకాలో నిర్బంధాలా?

- Advertisement -
- Advertisement -

కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా..?

లగచర్లలో నిర్బంధాన్ని ఎత్తివేసి..
ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : లగచర్లలో అర్థరాత్రి గిరిజన ఆడబిడ్డలపై దమనకాండే కాదు..పట్టపగలు వెళ్లిన మహిళా సంఘాల నేతలపైనా దౌర్జన్యమా..? అంటూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజనిర్ధారణకు వెళ్లిన వారిని కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటోంది..?… వాస్తవాలను తొక్కిపెట్టాలని ఈ సర్కారు ఎందుకు ప్రయత్నిస్తోంది..? అని ప్రశ్నించారు. సిఎం సొంత ఇలాకాలో ఇంతటి నిర్బంధం ఏమిటి..? అని నిలదీశారు. కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా..? లేక లగచర్ల.. చైనా బార్డర్‌లో ఉన్న కల్లోలిత ప్రాంతమా..? అని ప్రశ్నించారు.

పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేశారని, కొడంగల్‌కు వెళ్లే అన్ని దారుల్లో పోలీసుల పహారా ఏర్పాటు చేశారని అన్నారు. మీరెంత దాచే ప్రయత్నం చేసినా.. నిజం దాగదు..ఇప్పటికే లగచర్లలో కాంగ్రెస్ సర్కారు కిరాతకం ఢిల్లీకి చేరిందని పేర్కొన్నారు. దేశ రాజధానిలో కాంగ్రెస్ సర్కార్ అరాచకపర్వంపైనే తీవ్ర చర్చ జరుగుతోందని చెప్పారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను అడ్డుకోవడం అంటేనే..కాంగ్రెస్ సర్కారు తప్పుచేసినట్టు ఒప్పుకున్నట్టే లెక్క అని పేర్కొన్నారు. మహిళా సంఘాలను అడ్డుకున్నందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లగచర్లలో నిర్బంధాన్ని ఎత్తివేసి.. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News