ముంబై: టీం ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీలు(Virat Kohli).. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర అవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి అభిమానులు ఎంత మనస్తాపానికి గురయ్యారు. గత ఏడాది జరిగిన టి-20 ప్రపంచకప్ విజయం తర్వాత వీరిద్దరు టి-20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు టెస్టుల నుంచి తప్పుకోవడంతో కేవలం వన్డేల్లో మాత్రమే వీరిరువురి ఆట చూసే ఛాన్స్ ఫ్యాన్స్‌కి లభిస్తుంది.
రోహిత్(Rohit Sharma) కెప్టెన్సీలో టి-20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంత చేసుకుంది. వన్డే ప్రపంచకప్ కూడా ఫైనల్స్‌కు వెళ్లి చేజార్చుకుంది. ఇప్పుడు రోహిత్, విరాట్(Virat Kohli) టార్గెట్ వన్డే ప్రపంచకప్పే. అయితే ఇది జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని టిం ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఇద్దరు వన్డేల్లో గొప్ప ఆటగాళ్లని, 2027ల సెలక్షన్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం చెప్పలేమని అన్నారు.
‘‘రోహిత్, కోహ్లీ ప్రపంచకప్ జట్టులో ఉంటారో లేదో.. చెప్పలేం. ఒకవేళ సెలక్షన్ కమిటీ వాళ్లపై నమ్మకం ఉంచితే ఇద్దరు మరో ప్రపంచకప్ ఆడుతారు. నా అభిప్రాయం ప్రకారం అయితే.. వాళ్లు 2027 ప్రపంచకప్ ఆడరు. వచ్చే ఏడాది ఒకవేళ వాళ్లిద్దరు మంచి ఫామ్‌లోకి వస్తే.. అది కూడా శతకాలు బాదితేనే అప్పుడు దేవుడు కూడా వాళ్లను జట్టు నుంచి దూరం చేయలేడు’’ అని గవాస్కర్ పేర్కొన్నారు.