Wednesday, September 11, 2024

హత్యాచారం చేసి నిందితుడు హాయిగా నిద్రపోయాడు: విస్తుపోయే వివరాలు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై నిందితుడు సివిక్ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడడమే కాకుండా హత్య చేసిన తరువాత తన నివాసానికి వచ్చి హాయిగా నిద్రపోయినట్టు పోలీస్‌ల దర్యాప్తులో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు సంజయ్ రాయ్ హత్య చేసిన తరువాత తన నివాసానికి వచ్చి శుక్రవారం ఉదయం వరకు ప్రశాంతంగా నిద్ర పోయాడు.

ఆ తరువాత ఉదయం సాక్షాలను చెరిపివేయడానికి దుస్తులను ఉతుక్కున్నాడు. కానీ పోలీస్‌లు అతని బూట్లపై రక్తపు మరకలు ఆధారంగా నిందితుడిని గుర్తించ గలిగారు. నిందితుడు పౌర వాలంటీర్. ఆస్పత్రితో తనకేమీ సంబంధం లేదు. కానీ ఆస్పత్రి పరిసరాలకు తరచుగా వస్తుంటాడు. ఆసుపత్రి సెమినార్ హాలులో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగాక అర్థనగ్నంగా ఆమె మృతదేహం శుక్రవారం ఉదయం కనిపించింది. శనివారం నిందితుడి అరెస్ట్ జరిగింది. ఇందులో ఇంకెవరి ప్రమేయమేమైనా ఉందా అన్నది నిర్ధారించడానికి పోస్ట్‌మార్టమ్ తుది నివేదిక కోసం పోలీస్‌లు నిరీక్షిస్తున్నారు.

మొదట హత్య, తరువాత అత్యాచారం
ప్రాథమిక పోస్ట్‌మార్టమ్ నివేదిక ప్రకారం బాధితురాలి శరీరంపై అనేక గాయాలు ఉన్నాయి. కళ్ల నుంచి, నోరు, మర్మాయవాల నుంచి నెత్తురు వస్తోంది. ఎడమకాలిపైన, మెడ, కుడిచేయి,ఉంగరం వేలిపైన, పెదవుల పైన గాయాలు కనిపించాయి. సందోర్భోచిత సాక్షాల ప్రకారం జూనియర్ డాక్టర్ హత్య తరువాత అత్యాచారం జరగినట్టు తెలుస్తోందని మరో పోలీస్ అధికారి అభిప్రాయపడ్డారు. “ గురువారం రాత్రి నుంచి మరునాడు ఉదయం వరకు డ్యూటీలో ఎవరున్నారో వారందరితో మాట్లాడాం. సిసిటీవీ ఫుటేజీ చెక్‌చేశాం.” అని పోలీస్ ఆఫీసర్ చెప్పారు. ఆదివారం, సిట్, ఫోరెన్సిక్ బృందాలు సెమినార్ హాలు నుంచి నమూనాలు సేకరించారు. నిందితుడు లేకుండా క్రైమ్‌సీనును తిరిగి రీకన్‌స్ట్రక్ట్ చేసినట్టు వివరించారు.

ఉరి తీయాలనుకుంటే తీసుకోండి
నిందితుడు సంజయ్ రాయ్ దర్యాప్తు సమయంలో ఎలాంటి పశ్చాత్తాప పడలేదు సరికదా నిర్లక్షంగా “తనను ఉరి తీయాలనుకుంటే తీసుకోండి” అని సమాధానమిచ్చినట్టు పోలీస్‌లు చెప్పారు. అతడి ఫోన్ పూర్తిగా అశ్లీల వీడియోలు ఉన్నాయి. ఆసుపత్రి ఆవరణలో సిసిటివీ కెమెరా దృశ్యాల బట్టి శుక్రవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో నిందితుడు ఎమర్జెన్సీ రూమ్ లోకి ప్రవేశించినట్టు స్పష్టమైంది. కొన్ని గంటల తరువాత అదే భవనంలో జూనియర్ డాక్టర్ మృతదేహం కనిపించింది. ఆగస్టు 23 వరకు నిందితుడికి రిమాండ్ విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News