- Advertisement -
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభమన్ గిల్, సాయి సుదర్శన్ మంచి శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 114 భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సాయి సుదర్శన్ (52;36 బంతుల్లో 6 ఫోర్లు,1 సిక్స్),శుభమన్ గిల్(90; 55 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్ లు) జాస్ బట్లర్(41; 23 బంతుల్లో 8 ఫోర్లు ) పరుగులు చేశారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లలో వైభవ్ అరోరా , ఆండ్రే రసుల్,హర్షిత్ రాణా తలో వికెట్ తీశారు.
- Advertisement -