Monday, April 29, 2024

రైస్ మిల్లర్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీరియస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైస్ మిల్లర్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యానికి మద్దతు ధర చెల్లించకుంటే మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని చెప్పారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. మిర్యాలగూడలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని రైతులు కలిశారు. ధాన్యానికి మద్దతు ధర రావడంలేదని మంత్రికి రైతులు తెలపడంతో వెంటనే ఆయన మిల్లర్లతో ఫోన్‌లో మాట్లాడారు. రైతులకు మిల్లర్లు అన్యాయం చేస్తే ఊరుకోమని ఘాటుగా హెచ్చరించారు. పంటనష్టం జరిగిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కెసిఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్ద మోకరిల్లి కృష్ణా నీళ్లను ఆంధ్రాకు తరలించిందని మండిపడ్డారు. దక్షిణ తెలంగాణను కెసిఆర్ ప్రభుత్వం నాశనం చేసిందని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News