Monday, July 28, 2025

కూన శ్రీశైలం గౌడ్ తమ్ముడు వేధింపులు…. యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ ఇబ్బందులకు గురి చేయడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ దగ్గర గత 8 సంవత్సరాల నుంచి కుమార్ యాదవ్ పని చేస్తున్నాడు. శ్రీనివాస్ గౌడ్ చెందిన సమ్మక సారక్క కాంక్రీట్ వర్క్ లో కుమార్ యాదవ్ వర్కర్ గా పని చేస్తున్నాడు. పనిచేసే కంపెనీలో కోటి రూపాయల పైచిలుకు దొంగిలించవని కుమార్ పై శ్రీనివాస్ గౌడ్ నేరం మోపాడు. ప్రతి లెక్కకు తాను సమాధానం చెప్పానని తనకు ఏం సంబంధం లేదు అని చెప్పిన కూడా వినకుండా యువకుడిని శ్రీనివాస్ ఇబ్బందులకు గురి చేశాడు.

శ్రీనివాస్ గౌడ్ అనుచరులు కుమార్ యాదవ్ పై దాడి చేసి అనంతరం టాటా టియాగో కారు, సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళారు. కూకట్ పల్లిలోని వెంకట్రావు నగర్ కాలనిలో ఉంటున్న కుమార్ యాదవ్ సోమవారం ఉదయం మనస్థాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమారుడు చావుకు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ తమ్ముడు కారణమంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నుండి శ్రీనివాస్ గౌడ్ ఎంపిపిగా పనిచేశారు.

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News