Saturday, September 21, 2024

మాటలు కోటలు దాటుతున్నయ్ కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సాగు విస్తీర్ణం తగ్గిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శలు గుప్పించారు. కెసిఆర్ పాలనలో సాగు స్వర్ణయుగంలాగా ఉండేదని కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి గడ్డుకాలం వచ్చిందని మండిపడ్డారు. కెటిఆర్ తన ట్విట్టర్ లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఒక సంవత్సరంలోనే 15.30 లక్షల ఎకరాల విస్తీర్ణం తగ్గడంతో తెలంగాణ రైతు బతుకుకు తొలి ప్రమాద సంకేతమని కెటిఆర్ తెలిపారు. గత పది సంవత్సరాల కాలంలో దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణ, ఎనిమిది నెలల్లో ఎందుకింత విధ్వంసం ఏర్పడిందని ప్రశ్నించారు. రుణమాఫీ పేరుతో పెట్టుబడి సాయం ఇవ్వకపోవడంతో రైతులు అవస్థలుపడుతున్నారని, మొన్న వ్యవసాయానికి కరెంట్ కట్, నిన్న రుణమాఫీలో రైతుల సంఖ్య కట్, నేడు సాగయ్యే భూవిస్తీర్ణం కట్ అని రేవంత్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కెటిఆర్ చురకలంటించారు. సిఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నయ్ కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరం వాడుకునే విజన్ లేదని, ఆ ప్రాజెక్టుపై బురద రాజకీయం చేయడం తప్ప ఏమీ లేదన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో రైతు సాగుకు పెట్టుబడి ఇవ్వకపోవడంతో అన్నదాతలు, కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని కెటిఆర్ దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News