Thursday, October 10, 2024

ఆ ఎంఎల్ఎల బతుకు జూబ్లీబస్టాండ్: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శేరిలింగంపల్లిలో ఉప ఎన్నిక వస్తుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. శేరిలింగంపల్లిలో బిఆర్ఎస్ నేతలతో బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.  సబితా, సునీత అక్కలను నమ్ముకుంటే బిఆర్ఎస్ బతుకు జూబ్లీ బస్టాండ్ అవుతుందని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అనలేదా? అని అడిగారు. ఇప్పుడు పది మంది బిఆర్ఎస్ ఎంఎల్ఎలను కాంగ్రెస్ లో ఎలా చేర్చుకున్నావని రేవంత్ రెడ్డిని కెటిఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు పది మంది ఎంఎల్ఎల బతుకు జూబ్లీ బస్టాండ్ అయ్యిందని చురకలంటించారు. ఆ పది మందిని బిఆర్ఎస్ ఎంఎల్ఎలు కాదు, కాంగ్రెస్ వారు కూడా మా పార్టీకి చెందిన ఎంఎల్ఎ కాదు అంటున్నారని, రేపు ప్రజలు కూడా వారిని ఛీకొడుతారని దుయ్యబట్టారు.

ఉప ఎన్నికలు వస్తే ప్రజలు పక్కగా వారికి బుద్ధి చెబుతారన్నారు. బిఆర్ఎస్ ఎంఎల్ఎలను కాంగ్రెస్ లోకి చేర్చుకొని రేవంత్ రెడ్డి, మంత్రులు నీతి భాష్యమైన రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిఎం రేవంత్ రెడ్డి డ్రామాలతో రాజకీయం చేస్తున్నారని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధాప్య పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టిన రోజున రైతులకు రెండు లక్షల రుణమాఫీ హామీ ఇచ్చారని, ఎంత మంది రైతులకు రుణమాఫీ చేశారని అడిగారు. నలబై వేల కోట్ల రుణమాఫీని 11 వేల కోట్లకు మాత్రమే రుణమాఫీ చేశారని మండిపడ్డారు, షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు బంధు కింద పది వేల రూపాయలు ఇచ్చేవారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద రూ. 15 వేలు ఇస్తామని చెప్పారని, ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని కెటిఆర్ అడిగారు. ఇటీవల శేరిలింగంపల్లి ఎంఎల్ఎ అరికెపూడి గాంధీ బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News