Thursday, November 7, 2024

ఢిల్లీ కోసమే సిఎం డ్రామా: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూటల కోసమే మూసీ ప్రాజెక్టు అంచనా వ్యయం అమాంతం పెంచారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు.  ఢిల్లీ కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామాలాడుతున్నారని, దేశంలోనే ఇది అతిపెద్ద స్కామ్ మూసీ ప్రాజెక్టు అని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు ఎటిఎంలా మూసీ మారుతుందని, వాటాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీతో గ్రామ స్థాయిలో చర్చలు ఎందుకు అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీల అమలుకు లేని పైసలు మూసీకి ఎట్లొస్తయ్? అని నిలదీశారు. మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు అవతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారని, ఎప్పుడు ఉల్టా పల్టా ఎల్లా మాట్లాడుతారని,  ఆయన మానసికస్థితి బాగుందా? అని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ప్రజెంటేషన్‌లో గూగుల్‌ నుంచి డౌన్‌లోడ్ చేసిన ఫొటోలు వాడుకున్నారని, మెయిన్‌హార్ట్‌ కంపెనీ పాకిస్థాన్‌లో చేపట్టిన రావీ ప్రాజెక్టు అట్టర్‌ఫ్లాప్‌ అయిందని,  ఆ కంపెనీకి రెడ్‌కార్నర్‌ నోటీసులు కూడా ఇచ్చారని తెలియజేశారు. మెయిన్ హర్టార్ కంపెనీని పలు దేశాలు బ్లాక్‌ లిస్టులో పెట్టాయని, పేదల్ని ముంచకుండా, ఇండ్లు కూల్చకుండా  మూసీ సుందరీకరణ పనులు చేపట్టాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. మూసీ నదీ ప్రక్షాళనకు బిఆర్‌ఎస్‌ హయాంలోనే 16 వేల కోట్ల్లతో ప్లాన్‌ చేశామన్నారు. 

‘మద్యంపై ఉన్న ధ్యాస – మద్దతు ధరపై లేకపాయే’, ‘మద్యంపై ఉన్న ధ్యాస – మంచి బోధనపై లేకపాయే’, ‘మద్యంపై ఉన్న ధ్యాస – మందుబిళ్లలపై లేకపాయే’,  ‘మద్యం పై ఉన్న ధ్యాస – మూసి బాధితులపై లేకపాయే’, ‘మద్యంపై ఉన్న ధ్యాస – మంచినీళ్లపై లేకపాయే’,  ‘మద్యంపై ఉన్న ధ్యాస – పింఛన్ పెంపు పై లేకపాయే’,  ‘మద్యంపై ఉన్న ధ్యాస – భరోసా పెంపు పై లేకపాయే’ అని ఎద్దేవా చేశారు. 10 తగ్గిస్తే పగబట్టి 10 కి 10 కలిపి మరి పెంచుతున్నారని, నాడు అడ్డగోలు ఆరోపణలు నేడు అడ్డగోలు ధరల పెంచుతున్నారని దుయ్యబట్టారు. పెంచుకో – దంచుకో – పంచుకో అన్న విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చురకలంటించారు. నేడు మద్యం ధరల పెంపు… రేపు రేపు ఎన్ని పెంచుతారో అని అవేదన వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News