Saturday, September 21, 2024

రుణమాఫీపై నిగ్గదీసి అడుగుతాం.. నిజాలే చెబుతాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీతో రైతుల రుణాలు తీరలేదని, రైతు బతుకు మారలేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. శనివారం ఆయన తన ట్వీట్టర్ లో ట్వీట్ చేశారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) లెక్క ప్రకారం రైతుల రుణమాఫీ రూ. 49,500 కోట్లు కాగా, కేబినెట్ భేటీలో రూ. 31 వేల కోట్లు తేల్చారని,  బడ్జెట్ లో మాత్రం రూ. 26 వేల కోట్లు కేటాయించారని, 3 విడతల వారీగా కలిపి 17933 కోట్ల రుణాలు మాఫీ చేశారని కెటిఆర్ చురకలంటించారు. రెండు లక్షల రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలదీస్తే బెదిరింపులకు దిగుతున్నారని, ఎక్కడ తగ్గే పరిస్థితి లేదని, నిగ్గదీసి అడుగుదాం.. నిజాలే చెబుతామని, కాంగ్రెస్ డొల్ల మాటల గుట్టు విప్పుతూనే ఉంటామని హెచ్చరించారు. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News