హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికను ఆదివారం ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వ, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. సిఎం రేవంత్ రెడ్డి ఈ కేసును సిబిఐకి అప్పగిస్తామని అన్నారు. అయితే ఈ విషయంపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే కెటిఆర్ మండిపడ్డారు . ‘ఎక్స్’ వేదికగా ఆయన సిఎం రవంత్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సెటర్లు వేశారు.
‘‘తెలంగాణలో కరెన్సీ మేనేజర్(సిఎం) కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తారట.గతంలో రాహుల్ గాంధీ దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలను అంతం చేసే సెల్స్ అని అన్నారు. మిస్టర్ గాంధీ మీకు తెలుసా.. మీ సిఎం ఏం చేస్తున్నారో..? ఇలా ఎంత బెదిరించినా.. భయపడేది లేదని.. రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తాం. ప్రజలపై, న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది’’ అని కెటిఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో పాటు గతంలో రాహుల్ చేసిన పోస్ట్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఆయన జత చేశారు.
Also Read : కాంగ్రెస్ మాత్రం బిఆర్ఎస్ ను కాపాడుతూ ఆలస్యం చేసింది: బండి